కాటారం నేటి ధాత్రి
మండలంలోని బయ్యారం గ్రామంలో నిర్మించిన పల్లె ప్రకృతి పనులను జయ శంకర్ భూపాలపల్లి జిల్లా పంచాయతీ అధికారి ఆశలత పరిశీలించారు. బయ్యారం గ్రామం పల్లె ప్రగతి పనులలో భాగంగా నిర్మించిన స్మశాన వాటిక వాడకం సెక్రిగేషన్ షెడ్ వాడకం ను పర్యవేక్షించారు , డ్రైన్లు పరిశీలించారు మరియు రికార్డ్స్ తనిఖీ చేసి సర్పంచ్ గారికి మరియు పంచాయతీ కార్యదర్శి గారికి తగుచూచనలు జారీ చేయడం జరిగినది ఈ కార్యక్రమంలో మండల పంచాయతీ అధికారి ఉపేంద్రయ్య, సర్పంచ్ సంధ్య సురేందర్, పంచాయతీ కార్యదర్శ రజిత, గ్రామపంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు