
జిల్లా అధ్యక్షులు ఎలుకటి రాజయ్య మాదిగ
సింగరేణి ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు రేగుంట నర్సయ్య మాదిగ.
భూపాలపల్లి జిల్లాకి నూతనంగా నియమితులైనటువంటి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మని ఎమ్మార్పీఎస్ టిఎస్ జిల్లా అధ్యక్షుడు రాజయ్య మాదిగ సిపిఐ ఎంఎల్ జిల్లా కార్యదర్శి లిబరేషన్ పార్టీ జిల్లా కార్యదర్శి మల్లేష్ ఆధ్వర్యంలో అంబేద్కర్ చిత్ర పటాన్ని అందించి శాలువాతో సత్కరించడం జరిగింది. అనంతరం జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ కి భూపాలపల్లి జిల్లాలోని వివిధ సమస్యలపై వినతిపత్రం అందించడం జరిగింది…ఈ సందర్బంగా టీఎస్ ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షులు ఎలుకటి రాజయ్య మాదిగ మాట్లాడుతూ భూపాలపల్లి లోని భాస్కర్ గడ్డలో నిర్మించిన 2BHK లో అనేక అవకతవకలు జరుగుతున్నాయని ఆరోపించారు.అంగ, అర్ధ బలం ఉన్నవారికే డబల్ బెడ్ రూమ్ లని ప్రజా ప్రతినిధులు అధికారులు కుమ్మక్కు అయి అమ్ముకుంటున్నారు అని తెలియచేసారు తద్వారా నిజమైన అర్హులకు తీవ్ర స్థాయిలో నష్టం జరుగుతుందని తెలిపారు ప్రభుత్వం అర్హులకు కేటాయించినటువంటి డబల్ బెడ్ రూమ్ లను కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే వారిని అర్హుల జాబితా ని తొలగించడం ఎంత వరకు సమంజసం అని ప్రశ్నించారు.కావున ఇలాంటి అక్రమాలకు తావివ్వకుండా క్షేత్ర స్థాయిలో పునర్విచారణ జరిపించి అర్హులకు న్యాయం జరిగేలా చూడాలని కలెక్టర్ గారిని కోరడం జరిగింది.. లేని పక్షంలో భాధితుల పక్షాన నిలబడి న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని తెలిపారు..ఈ కార్యక్రమంలో సిపిఐ ఎంఎల్ లిబరేషన్ పార్టీ జిల్లా కార్యదర్శి మారేపెల్లి మల్లేష్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ రేణుకుంట్ల మహేష్ మాదిగ యోజకవర్గ ఇంచార్జి శీలపాక హరీష్ మాదిగ లు పాల్గొన్నారు.