Residents Face Hardships in Double Bedroom Houses in Zeheerabad
డబుల్ బెడ్ రూమ్ ఇండ్లకు వీడని అ సౌకర్యాల గ్రహణం
◆:- పి.రాములు నేత
జహీరాబాద్ నేటి ధాత్రి:
జహీరాబాద్ పట్టణంలోని హోతి కే దగ్గర దాదాపు 600 మందికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు నిర్మించి ఇవ్వడం జరిగినది ఈ ఇండ్లలో కనీస సౌకర్యాలైన మంచినీరు వీధిలైట్లు శుభ్రమైన పరిసరాలు లేక ప్రజలు అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు కనీసం మంచినీరు కూడా అసలే రావడం లేదు ఇప్పటికే ఇండ్లలో 90 శాతం మంది నివాసముంటున్నప్పటికిని అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు రాత్రి వేళల్లో ఇండ్ల మధ్య తిరగాలంటే ప్రాణం చేతిలో పట్టుకొని ఏ విషపురుగులు కాటేస్తాయోనని భయపడుతున్నారు కాలనీలో పూర్తి చిమ్మ చీకట్లు కమ్ముకుంటున్నాయి మంచినీళ్లు లేక కాలనీకి అంటుకొని ఉన్న బోరు బావుల వద్ద చిన్న పెద్ద అని తేడా లేకుండా అందరు వెళ్లి మంచినీళ్లు తెచ్చుకుంటున్నారు ఇండ్ల మధ్యలో ఉన్న మురికి ఎక్కడికి అక్కడే అట్లాగే ఉంది దట్టమైన పోదలు కుప్పలు కుప్పలుగా వృధా అయిన నిర్మాణ సామగ్రి ఎక్కడికి అక్కడే పడి ఉంది ఈ విషయాలన్నీ కూడా కాలనీలోని ఒకరి గృహానికి గృహప్రవేశానికి విచ్చేసిన పి. రాములు నేత జాగో తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు దృష్టికి తేవడంతో తను స్పందించి కనీసం వీధి స్తంభాలకు చిన్నపాటి బల్బులు అయిన వేయిస్తాను అని చెప్పి వీధి స్తంభాలకు బల్బులు వేయించడం జరిగింది దీనికి సంతోషించిన కాలనీ ప్రజలు రాములు నేత గారికి కృతజ్ఞతలు తెలిపినారు రాములు నేత కాలనీ ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ మీరంతా ఐక్యంగా ఉంటే ఈ విషయాలన్నీ కూడా అధికారుల దృష్టికి తెస్తాం వాస్తవానికి ప్రభుత్వం ప్రజల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతుంటే అధికారులు వాటిని నీరుగార్చాలని చూస్తున్నారు అధికారుల నిర్లక్ష్యంతోనే ఇదంతా కొనసాగుతుంది ఈ సమస్యలన్నీ కూడా అధికారులు అనుకుంటే ఒక రోజులో పూర్తయ్యేటట్లు చేయగలరని ప్రభుత్వానికి ఇరకాటం పెట్టడానికి ప్రజలకు అయోమయానికి గురిచేస్తూ ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకువస్తున్నారని ఇదంతా అధికారుల పెద్ద ఎత్తు నిర్లక్ష్యమని అధికారులతో కచ్చితంగా పనిచేయిస్తామని కాలనీ ప్రజలను ఉద్దేశించి మాట్లాడినారు ఇకనైనా ప్రభుత్వ అధికారులు నిర్లక్ష్యాన్ని అశ్రద్ధలు వీడి కాలనీ ప్రజలకు మెరుగైన సౌకర్యాలు అందించాలని కాలనీ ప్రజల తరఫునుండి కోరినారు కార్యక్రమంలో జహీరాబాద్ బిజెపి పట్టణ కార్యవర్గ సభ్యులు అప్పం శ్రావణ్ రిటైర్డ్ రెవిన్యూ అధికారి నరసింహులు పాల్గొన్న తదితరులు పాల్గొన్నారు,
