
ఘనంగా నెహ్రూ నాయక్ జన్మదిన వేడుకలు
నెహ్రూ నాయక్ పుట్టిన రోజు ని కురవి భదక్రాలి సమెత వీరభద్ర స్వామి నీ దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించిన TPCC రాష్ట్ర ఆదివాసి గిరిజన వైస్ చైర్మన్&డోర్నకల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మాలోత్ నెహ్రూ నాయక్
మరిపెడ నేటి ధాత్రి.
మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండల కేంద్రంలోని భార్గవ ఫంక్షన్ హాల్లో డోర్నకల్ నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశంలో నెహ్రూ నాయక్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిపారు ఈ సందర్భంగా మాలోత్ నెహ్రూ నాయక్ మాట్లాడుతు నా పైన ఇంత ప్రేమ చూపిస్తున్న నా కార్యకర్తలకు అభిమానులకు ధన్యవాదాలు
ఈ ప్రేమ ఇప్పటికే ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అదే విధంగా వచ్చే పుట్టిన రోజు ఎమ్మెల్యే గా జరుపుకోవాలని డోర్నకల్ నియోజకవర్గం అభివృది అంటే ఎంటొ చూపిస్తా అని అన్నారు, పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ వచ్చే ఎన్నికల్లో విజయ డంక మోగిస్తుందని దిమా వ్యక్తం చేశారు, ప్రతి ఒకరు కలిసి కట్టుక పని చేసి డోర్నకల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవెయడానికి సిద్దాం కావాలి అని పిలుపునిచ్చారు, రాబోయే ఎన్నికల్లో డోర్నకల్ నియోజకవర్గ ప్రజలు దీవించి కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలని డోర్నకల్ గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగరవేస్తామని ధీమా వ్యక్తం చేశారు డోర్నకల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి గ్రూపులు లేవు అన్నారు ఎవరికి టికెట్ ఇచ్చినా, నాకు టికెట్ ఇచ్చిన రామచందర్ నాయక్ టికెట్ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకెళ్తామని డోర్నకల్ నియోజకవర్గ అభివృద్ధి మాకు ధ్యేయం అని తెలిపారు, అధికార బిఆర్ఎస్ పార్టీ మీద ప్రజలకు నమ్మకం కోల్పోయింది అన్నారు, తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగ యువత చాలామంది ఉపాధి ఉద్యోగ అవకాశాలు లేక సతమతం అవుతున్నారు అన్నారు,రాష్ట్రంలో దేశంలో వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని నిరుపేదలకు యువతకు కాంగ్రెస్ ప్రభుత్వంలో సముచిత న్యాయం జరుగుతుందన్నారు, ఈనెల 17న ఎఐసిసి అధ్యక్షురాలు సోనియాగాంధీ వచ్చే సభకు జన సమీకరణ డోర్నకల్ నియోజకవర్గం నుంచి భారీ ఎత్తున తరలి వెళ్లాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు, ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు భరత్ చందర్ రెడ్డి, మాజీ జడ్పీ చైర్మన్ మెరుగు సత్యనారాయణ గౌడ్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు డివై గిరి, కొండం దశరథ, డోర్నకల్ మండల అధ్యక్షుడు డిఎస్ జగదీష్, కురవి వద్దుల మహేందర్ రెడ్డి, మరిపెడ మండల అధ్యక్షుడు కోట వెంకటరెడ్డి నరసింహులపేట మండల అధ్యక్షుడు చంద్రారెడ్డి చిన్న గూడూరు మండల పార్టీ అధ్యక్షుడు బిక్కు నాయక్, దంతాలపల్లి మండల అధ్యక్షుడు భరత్ బాబు, సిరోలు మండల పార్టీ అధ్యక్షుడు, రాంపురం గ్రామ పార్టీ అధ్యక్షుడు కొంచెం మహేష్, గణేష్, సోషల్ మీడియా శ్రీనివాస్, నియోజకవర్గం లోని ముఖ్య కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.