Doordarshan Team Inspects Soak Pits
ముదిగుంట లో ఇంకుడు గుంతలను పరిశీలించిన దూరదర్శన్ సిబ్బంది
జైపూర్,నేటి ధాత్రి:
మండలంలోని ముదిగుంట గ్రామంలో ఇంకుడు గుంతలను పరిశీలించిన దూరదర్శన్ సిబ్బంది.ప్రధాన మంత్రి మనకి బాత్ ప్రోగ్రాం లో భాగంగా దూరదర్శన్ ఛానల్ వారు శనివారం ముదిగుంట గ్రామంలో నిర్మించిన ఇంకుడు గుంతలను ఇంటింటికి తిరిగి పరిశీలించారు.ఇంకుడు గుంతలు నిర్మాణం వలన లబ్ధిదారులకు,గ్రామానికి జరిగిన ప్రయోజనాలను లబ్ధిదారుల నుండి అడిగి తెలుసుకున్నారు.వాటర్ షెడ్ డిపార్ట్మెంట్ వారు ఫారెస్ట్ లో చేపట్టిన నీటి కుంటలను పరిశీలించారు.ఈ కార్యక్రమంలో ముదిగుంట గ్రామ సర్పంచ్ ఆకుల రవికుమార్,ఎంపీడీవో సత్యనారాయణ గౌడ్,ఎంపీఓ శ్రీపతి బాబురావు,పంచాయతీ కార్యదర్శి పి.సురేష్,ఉపాధి హామీ టెక్నికల్ అసిస్టెంట్,ఫీల్డ్ అసిస్టెంట్,గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
