పక్కాగా,,,, నల్లాల లెక్క
శాయంపేట నేటి ధాత్రి:
శాయంపేట మండలంలో మిషన్ భగీరథ ఇంటింటికి తాగునీరు అందించడం కోసం ఇంటింటికి పక్కాగా నల్లాల లెక్క కోసం మండల ప్రాంతంలో త్రాగునీరు సరఫరా తీరును తెన్నులపై ప్రభుత్వం ప్రత్యేక సర్వేకు శ్రీకారం చుట్టింది. ఇంటింటికి నల్ల కలెక్షన్లు లెక్క కోసం ప్రభుత్వం పకడ్బందీగా లెక్కను ఏర్పాటు చేయడం జరిగింది.ప్రభుత్వం ప్రత్యేక సర్వేకు శ్రీకారం చుట్టింది అంతేకాకుండా మిషన్ భగీరథ పైపులైన్ నీరు సరఫరా పరిశీలన తాగునీటి సమస్య రాకుండా చూడాలని ప్రత్యేక అధికారి పేర్కొన్నారు మండల అన్ని వీధుల్లో నీరు సరఫరా పరిశీలన పురవీధుల్లో ఉన్న ప్రజల అడిగి తెలుసుకున్నారు. మంగళవారం నాడు మండలoలో గల ఇంటింటికి సర్వేను చేపట్టారు. ఈ కార్యక్రమంలో ప్రత్యేక అధికారి మనోహర్, ఎం పి ఓ బుర్ర రంజిత్ కుమార్, గ్రామ పంచాయతీ కార్యదర్శి రత్నాకర్, గ్రామపంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు,