పరకాల నేటిధాత్రి
హన్మకొండ జిల్లా పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి ఆదేశాల మేరకు పరకాల మున్సిపల్ చైర్మన్ సోదా అనిత రామకృష్ణ 36,37,38,39,42,64వ బూత్ లలో ఇంటింటికీ తిరుగుతూ బొట్టు పెడుతూ,ఈవిఎం ప్యాడ్ ప్రదర్శిస్తూ వరంగల్ పార్లమెంట్ అభ్యర్థి కడియం కావ్య చేతి గుర్తుకు ఓటెయ్యాలని కోరడం జరిగింది.ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు కొయ్యాడ శ్రీను కౌన్సిలర్ పసుల లావణ్య రమేష్,నల్లెల జ్యోతి అనిల్ కుమార్,పంచగిరి జయమ్మ బూత్ కమిటీల అధ్యక్షులు,బూత్ కమిటీల మెంబర్స్,మహిళ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.