తంగళ్ళపల్లి. నేటి ధాత్రి:
తంగళ్ళపల్లి మండలం అంకుసాపురం గ్రామంలో బి.ఆర్.ఎస్ పార్టీ ఆధ్వర్యంలో వాడవాడల తిరుగుతూ కారు గుర్తుకే ఓటేసి వచ్చే ఎన్నికల్లో మన బి.ఆర్.ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి మన మంత్రి కేటీ రామారావుని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుతూ ఇంటింటా ప్రచారం చేయడం జరిగింది ఇట్టి కార్యక్రమంలో వారు మాట్లాడుతూ మన ప్రియతమ మంత్రి కేటీ రామారావు మన నియోజక వర్గాన్ని అందులో మన తంగళ్ళపల్లి మండలాన్ని గ్రామ గ్రామంలో ఎన్నో అభివృద్ధి సంక్షేమ పథకాలు తీసుకొచ్చి మండలంలో ప్రతి గ్రామాన్ని ఎంతో అభివృద్ధి పరిచారని అలాంటి మంత్రి మనకు దొరకడం మన అదృష్టంగా భావించాలని అలాగే మన ప్రియతమ ముఖ్యమంత్రి కెసిఆర్ దేశంలోనే మన తెలంగాణ రాష్ట్రాన్ని ఎంతో అభివృద్ధి పరిచి మన రాష్ట్రాన్ని ముందంజలో ఉంచారని ఈ సందర్భంగా తెలియజేస్తూ వచ్చే ఎన్నికల్లో మన మంత్రి కేటీరామారావుని లక్ష ఓట్ల మెజార్టీతో గెలిపించుకోవాలని ఈ సందర్భంగా తెలియజేశారు ఇట్టి కార్యక్రమంలో ఎంపీపీ పడిగల మానస రాజు స్థానిక సర్పంచ్ ఎంపీటీసీలు కుంటయ్య కోడి అంతయ్య మండల అధ్యక్షులు రాజన్న గ్రామ శాఖ అధ్యక్షులు బి ఆర్ ఎస్ పార్టీ రాష్ట్ర సీనియర్ నాయకులు పూర్మని లింగారెడ్డి మాజీ డైరెక్టర్ కుర్మారాజయ్య పార్టీ సీనియర్ నాయకులు యూత్ నాయకులు కార్యకర్తలు తదితరులు ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు