
*రఘునాథపల్లి ( జనగామ )
నేటి ధాత్రి:-*
వరంగల్ లోకసభ కాంగ్రెస్ అభ్యర్థి కడియం కావ్య గెలుపు కోసం మండల కేంద్రంతో పాటు మండలం లోని అన్ని గ్రామాలలో కాంగ్రెస్ నాయకులతో పాటు కార్యకర్తలు సోమవారం ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ జిల్లా మహిళా కార్యదర్శి పోరెడ్డి లక్ష్మి ప్రభాకర్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటేనే అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు దక్కుతాయని అన్నారు. కడియం కావ్య గెలుపు కోసం ప్రతీ కార్యకర్త కృషి చేయాలనీ అన్నారు. స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గం నుండి కడియం కావ్యకు అత్యధిక మెజార్టీటి అందించాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
కాంగ్రెస్ సంక్షేమ ప్రభుత్వం అమలుచేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను ఇంటింటికీ తిరుగుతూ వివరిస్తూ పార్లమెంటు ఎన్నికలలో కాంగ్రెస్ కు పట్టం కట్టాల్సిన అవశ్యకత గురించి వివరిస్తూ కడియం కావ్యను అత్యదిక మేజార్టీతో గెలిపించాలని కోరారు.ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు గాదె మహేందర్ రెడ్డి,నామాల బుచ్చయ్య,మల్కాపురం లక్ష్మయ్య,ఎం డి భాష్మీయ,నరేష్, కడారి రవి, రాయప్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.