
హన్మకొండ, నేటిధాత్రి:
హన్మకొండ జిల్లా అధ్యక్షులు దాస్యం వినయ్ భాస్కర్ సూచనల మేరకు హన్మకొండ 5వ డివిజన్ అధ్యక్షుడు పున్నం చందర్ ఆధ్వర్యంలో సుభాష్ నగర్ లో బిఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి సుధీర్ కుమార్ కారు గుర్తుకు ఓటు వేయాలని ప్రతి ఇంటికి తిరిగి ప్రచారం చేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో 5వ డివిజన్ అధ్యక్షుడు పున్నం చందర్ మాట్లాడుతూ రానున్న పార్లమెంట్ ఎన్నికలలో అన్ని చోట్లల్లో బిఆర్ఎస్ పార్టీ మంచి విజయం సాధిస్తుందని ప్రజలందరూ బిఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఆదరిస్తున్నారని మళ్లీ పాత రోజులు రాబోతున్నాయని రైతుల జీవితాలు బాగుపడాలంటే బిఆర్ఎస్ ని ఆదరించాలని ఈ సందర్భంగా మాట్లాడడం జరిగింది. ఈ కార్యక్రమంలో పండగ సాగర్ నారాయణగిరి రాజు నలబోల వినయ్ విశాల్ సాయి వినో ద్ రవీందర్ మూల ప్రభాకర్ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొనడం జరిగింది.