నర్సంపేట,నేటిధాత్రి :
త్వరలో జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ భారతీయ జనతా పార్టీ అభ్యర్థి అజ్మీర సీతారాం నాయక్ గెలుపు కోరుతూ నర్సంపేట పట్టణంలో బిజెపి పట్టణ అధ్యక్షులు 4వ వార్డు కౌన్సిలర్ శీలం రాంబాబు గౌడ్ ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు.ఈ సందర్భంగా శీలం రాంబాబు గౌడ్ మాట్లాడుతూ జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో మహబూబాబాద్ అభ్యర్థి అజ్మీర సీతారాం నాయక్ ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.దేశంలో మరొకసారి మోడీ ప్రధానమంత్రి ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పట్టణ ప్రధాన కార్యదర్శులు గూడూరు సందీప్,కొంపెల్లి రాజు, బూత్ అధ్యక్షులు బూరుగు సాయిరాజ్,సామల ప్రవీణ్ కుమార్ బీజేవైఎం టౌన్ ప్రధాన కార్యదర్శి భవాని శంకర్,బిజెపి నాయకులు బూరుగు చరణ్, మాసు స్వామి, పోల్ సత్యం, బోలు గొడ్డు,అనీల్, సాయికుమార్, పాల్గొన్నారు.