దొంతికి మంత్రిపదవి రావాలని మోకాళ్ళ నడకతో దర్శనం.
కొమ్మాల దేవాలయం మెట్లపై కాంగ్రెస్ నాయకుల వినూత్న ప్రయాణం.
నర్సంపేట,నేటిధాత్రి:
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం త్వరలో చేపట్టనున్న మంత్రివర్గ విస్తరణ చేపట్టనున్న నేపథ్యంలో నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవ రెడ్డికి మంత్రి పదవి రావాలని కోరుకుంటూ దుగ్గొండి మండలం యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు కొత్తకొండ రవివర్మ ఆధ్వర్యంలో
గీసుకొండ కొమ్మాల శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముందుగా లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం గుట్టపైకి మెట్ల నుండి మోకాళ్ళ నడకతో భక్తి శ్రద్ధలతో స్వామివారిని దర్శించుకున్నారు.

మండలం యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు కొత్తకొండ రవివర్మ,నర్సంపేట బ్లాక్ కాంగ్రెస్ యూత్ వర్కింగ్ ప్రెసిడెంట్ డ్యాగం శివాజీలు మాట్లాడుతూ కష్టకాలంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని పూర్వవైభవం తెచ్చిన ఘనత ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డికి దక్కుతుందన్నారు. త్వరలో జరగబోయే మంత్రివర్గ విస్తరణలో వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గం ఎమ్మెల్యే మాధవరెడ్డికి మంత్రి పదవి ఇవ్వాలని ఈ సందర్భంగా కాంగ్రెస్ అధినాయకత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో నర్సంపేట సాంస్కృతిక అధ్యక్షులు గుండెకారి సునీల్,నాచినపల్లి గ్రామ యూత్ అధ్యక్షులు ఇజ్జగిరి నరేష్,
మహ్మదాపురం గ్రామ యూత్ అధ్యక్షులు ఆడెపు అనిల్,మండల యూత్ నాయకులు బండారి ప్రకాష్ గారు,కూరతోట సురేష్ గారు,మునుకుంట్ల నాగరాజు,భూక్య గోపి,దండు రాజేందర్,మ్యాక అశోక్,గంగారపు శ్రీకాంత్,కొమాకుల రఘుపతి,బూర్గుల రాజబాబు,ఇజ్జగిరి యశ్వంత్ లు పాల్గొన్నారు.