Weeds Take Over Open Gym Road in Ramakrishnapur
పిచ్చి మొక్కలు ఏపుగా పెరిగిన పట్టించుకోరా…
ఓపెన్ జిమ్ కు దారేది సార్లూ…
రామకృష్ణాపూర్, నేటిధాత్రి:
క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధిలోని రామకృష్ణాపూర్ పట్టణంలో గల 17 వ వార్డ్ శ్రీనివాస్ నగర్ ఏరియాలో ఇళ్ల మధ్య ఏపుగా పిచ్చి మొక్కలు పెరగడంతో పిచ్చి మొక్కలలో చెత్తాచెదరం చేరుకొని దోమలకు ఆవాసాలుగా మారి కాలనీవాసులు జ్వరాలు బారిన పడుతున్నారంటూ కాలనీవాసులు వాపోతున్నారు. మొక్కలు ఏపుగా పెరగడంతో విష జ్వరాలకు నిలయంగా మారడంతో రాత్రిపూట బయటకు రావాలంటే భయాందోళనకు గురవుతున్నామన్నారు. పిచ్చి మొక్కలు ఏపుగా పెరగడంతో విష సర్పాలు సంచరించడంతో పాటు క్రిమి కీటకాలు దోమల బెడద కూడా ఎక్కువైందని వారు ఆరోపిస్తున్నారు. చికెన్ గున్యా, డెంగి ,మలేరియా వంటి వైరల్ జ్వరాలు రాకుండా పిచ్చి మొక్కలను

తొలగించాలని మునిసిపాలిటీ అధికారులను వారు కోరుతున్నారు. ఎస్ఆర్కే పాఠశాల పక్కన గల రోడ్డు సరిగా లేదని, పాఠశాల సమీపంలో లక్షలు వెచ్చించి ఓపెన్ జిమ్ ఐతే ఏర్పాటు చేశారు కానీ ఓపెన్ జిమ్ కు వెళ్ళే దారి మొత్తం పిచ్చి మొక్కలతో నిండుకు పోయిందని ,వ్యాయామం కోసం వెళ్లే వారు సైతం పిచ్చి మొక్కల ను చూసి ఓపెన్ జిమ్ కు వెళ్లలేకపోతున్నారని ఆరోపిస్తున్నారు. పాలకవర్గం లేకపోవడంతో స్థానిక నాయకులు సైతం కాలనీలోని సమస్యలను పట్టించుకోవడంలేదని ఇప్పటికైనా స్థానిక మునిసిపాలిటీ అధికారులు చొరవ తీసుకొని కాలనీ సమస్యలు తీర్చాలని వారు కోరుతున్నారు.
