ఎల్లంపల్లి పైప్ లైన్ గేటువాల్వులు ధ్వంసం చేసినా పట్టించుకోరా?

రామడుగు, నేటిధాత్రి:

అధికారుల అనుమతి లేకున్నా కొంతమంది కలిసి ఎల్లంపల్లి పైపులైను గేట్వాలులను ధ్వంసం చేసి వృధాగా పోతున్న నీరు పంట పొలాలలోకి వెళ్లి నష్టపోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వివరాలలోకి వెళితే కరీంనగర్ జిల్లా రామడుగు మండలం గోపాలరావుపేట, గుండి గ్రామాల మీదుగా గత పదేళ్ల క్రితం ఎల్లంపల్లి నుండి రెండుపైపులైన్ల ద్వారా సాగునీటి కోసం గంగాధర మండలం నారాయణపూర్ రిజర్వాయర్ లోకి నీరు వెళ్లేందుకు ప్రక్రియను అప్పట్లోనే పూర్తి చేశారు. ఈక్రమంలో గతవారం రోజుల క్రితం ఎల్లంపల్లి నుండి గంగాధర మండలం నారాయణపూర్ రిజర్వాయర్ కు సాగు నీటి కోసం ఇరిగేషన్ శాఖ అధికారులు నీటిని విడుదల చేశారు. కాగా ఎల్లంపల్లి పైప్ లైన్ కు రామడుగు మండలం గోపాలరావుపేట గుండి గ్రామాలలో సుమారు రెండు మూడు కిలోమీటర్లకు మూడు నుంచి నాలుగు గేట్వాలులను అమర్చారు. ఇదే అదునుగా చేసుకున్న కొంతమంది కలిసి రామడుగు మండలం గోపాలరావుపేటకు సమీపంలోని ఎల్లంపల్లి పైప్ లైన్ మీద ఉన్న రెండు గేటు వాలువులను ధ్వంసం చేయడంతో నీరంతా ఎత్తిపోస్తుంది. ఇంతే కాకుండా దేశాయిపేట చెరువులోకి నీరు వెళ్లేందుకు ఏకంగా జెసిబితో పైపులైన్ పై కాలువ తీసి గోపాలరావుపేట రైతుల పంట పొలాల ద్వారా అనుమతి లేకుండా అక్రమంగా ప్రత్యేకంగా ఓకాలువను తీసుకుని వెళ్లారు. దీంతో గేట్వాలుల నుండి వచ్చే నీరంతా రైతుల పంట పొలాల్లోకి వెళ్లడంతో నష్టపోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గోపాలరావుపేట గ్రామానికి చెందిన ఎడవెల్లి రాంచంద్రారెడ్డి అనే రైతు పొలంలో తన అనుమతి లేకుండానే జెసిబితో ప్రత్యేకంగా కాలువను తవ్వి నీటిని చెరువులోకి తరలిస్తున్నారని తెలియజేశారు. ఇరిగేషన్ శాఖ అధికారులు అనుమతి ఇవ్వకుండా ఎల్లంపల్లి పైపులైనుపై ఉన్న గేట్వాలులను ధ్వంసం చేసి అక్రమంగా రైతుల పొలాల్లో నుండి అక్రమంగా నీటిని తరలించిన వారిపై చర్యలు తీసుకోవాలని పంటలు నష్టపోయిన బాధిత రైతులు కోరుతున్నారు. ఇంతతంతు జరుగుతున్న ఇరిగేషన్ శాఖ అధికారులకు కనీసం చీమకుట్టినట్లయినా లేదనిపిస్తుందని ఇప్పటికైనా అధికారులు మేల్కోని గేట్వాలులను ధ్వంసం వారిపై చర్యలు తీసుకోవాలని బాధిత రైతులు కోరుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!