ప్రైవేట్ పాఠశాలలు వద్దు.. ప్రభుత్వ పాఠశాలలే ముద్దు..

#మండలంలో పాఠ్య పుస్తకాలు, యూనిఫామ్స్ మరియు నోట్ బుక్స్ పంపిణీ మండల విద్యాశాఖాధికారి సామల శ్రీనివాసులు

వెంకటాపూర్, నేటిధాత్రి:
మండల విద్యా వనరుల కేంద్రం వెంకటాపూర్ యందు స్థానిక ఉన్నత పాఠశాల మరియు ప్రాథమిక పాఠశాలలకు చెందిన ఉచిత పాఠ్య పుస్తకాలు యూనిఫామ్స్ మరియు నోట్ పుస్తకాలను సోమవారం రోజున మండల విద్యాధికారి సామల శ్రీనివాసులు ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ మండలంలోని మిగతా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు కూడా త్వరగా తీసుకొని పాఠశాల పునః ప్రారంభం రోజున విద్యార్థినీ విద్యార్థులకు పంపిణీ చేయాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు అన్ని రకాల వసతులతో పాటుగా గత సంవత్సరం నుండి నోట్ బుక్స్ కూడా అందించడం శుభపరిణామం అని తెలుపుతూ ప్రైవేట్ పాఠశాలలో డబ్బులు పెట్టి తల్లిదండ్రులు ఇబ్బందులకు గురి కావద్దని ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లల్ని చేర్పిస్తే మానసికంగా శారీరకంగా దృఢంగా ఉంటూ చదువులో గానీ క్రీడల్లో గానీ మంచి పరిణతి చెందుతారని, గుణాత్మక విద్యను పొందే విధంగా విద్యార్థుల తల్లిదండ్రులు ఆలోచన చేసి మన ఊరి బడిలో మన విద్యార్థులను చేర్పించే విధంగా తల్లిదండ్రులు యువకులు యువజన సంఘాలు వివిధ సంఘ నాయకులు ప్రజాప్రతినిధులు మేధావులు ఆలోచన చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో వెంకటాపూర్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు టి.రాధిక ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు పి.సలేంద్రం ఉపాధ్యాయులు వంక సాంబయ్య చెవుల మహేష్ ఓదెల వేణు మండల ఎంఐఎస్ కో-ఆర్డినేటర్ సోమిడి కరుణాకర్ ఐఆర్పీ గంగాధర్ సిఆర్పీ కుమార్ పాడ్య తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *