నూతన గ్రామ పంచాయతీ కార్యాలయం ప్రారంభించిన ప్రభుత్వ విప్ అడ్లూరీ లక్ష్మణ్ కుమార్!!
ఎండపల్లి జగిత్యాల నేటిధాత్రి ఎండపెల్లి మండలం కొత్తపేట గ్రామానికి చెందిన నూతన గ్రామ పంచాయితీ కార్యాలయాన్ని శనివారం రోజున ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ప్రారంభించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.నూతన గ్రామ పంచాయితీ కార్యాలయ ప్రారంభోత్సవ కార్యక్రమంలో నన్ను భాగస్వాములను చేసినందుకు చాలా సంతోషంగా ఉందని, ప్రభుత్వం వచ్చిన వెంటనే ఇచ్చిన హామీ ప్రకారం మహిళలకు ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణం,ఆరోగ్య శ్రీ పరిధి పెంపు వంటి హామీలను అమలు చేయడం జరిగిందని, రాష్ట్రం ఎంత ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పేద ప్రజలకు మేలు చేయాలనే ఉద్దేశంతో ముందుకు వెళ్ళడం జరుగుతుందని,ప్రజలకు నేరుగా సంక్షేమ ఫలాలు అందించే విషయంలో ప్రభుత్వం కట్టుబడి ఉందని,కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలను కచ్చితంగా అమలు చేస్తుందని ఎండపెల్లి మండలానికి సంబందించిన,ప్రతి సమస్యను పరిష్కరిస్తామని ఈ సందర్భంగా తెలిపారు. లక్ష్మణ్ కుమార్ అనే నన్ను ఎమ్మేల్యే గా భావించ వద్దు అని మీ సేవకుడిగా భావించండి అని తెలిపారు,ఈ కార్యక్రమంలో పిసిసి కార్య వర్గ సభ్యులు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శైలేందర్ రెడ్డి సర్పంచ్ కొమ్ము రాంబాబు, ఉప సర్పంచ్
గోనె లక్ష్మి గంగారెడ్డి ,ఎంపిటిసి
నక్క పూజిత ప్రశాంత్
ఎంపీపీ కూనమల్ల లక్ష్మి, లింగయ్య, తహశీల్దార్ ఉదయ్ కుమార్, ఎంపిడిఓ సంజీవ రావు, ఎంఈ ఓ బత్తుల భూమయ్య,వార్డు సభ్యులు మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు
లక్ష్మణ్ కుమార్ నీ ఎమ్మేల్యే గా భావించవద్దు మీ సేవకుడిగా భావించండి!!
