‌నాపై తప్పుడు ప్రచారం చేయొద్దు..

అక్కడ జరిగిన సంఘటనలకు నాకు ఎలాంటి సంబంధం లేదు.

సంఘటన జరిగిన రోజున హైదరాబాద్ లో కూడా లేను.

వరంగల్ లో ఎల్లమ్మ పండుగ కార్యక్రమంలో వున్నాను.

రాజకీయంగా నన్ను ఇబ్బంది పెట్టడానికే కొందరు నాపై దుష్పచారం మొదలుపెట్టారు.

నేను భూ యజమానిని కావడం వల్ల పోలీసులు నాకు నోటీసులు జారీ చేశారు.

నేను అందుకు సంబంధించిన వివరణ ఇస్తాను. పోలీసు విచారణకు సహకరిస్తాను.‌

మీడియా మిత్రులకు మనవి. ఎటువంటి ఆధారాలు లేకుండా అభూత కల్పనలతో కథనాలు ప్రసారం చేయొద్దు.

సోషల్ మీడియాలో నాపై దుష్పచారం చేస్తున్న వ్యక్తులకు లీగల్ నోటీసులు పంపించడానికి వెనుకాడను.

ఎమ్మెల్సీ “పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి”.

“నేటిధాత్రి”, హైదరాబాద్.

తెలంగాణ ఉద్యమకారుడిగా, ప్రజా ప్రతినిధిగా 20 సంవత్సరాల పాటు మచ్చలేని నాయకుడు, వివాద రహితుడిగా పేరు సంపాదించుకున్నాను. మొయినాబాద్ మండల తోల్కట్డ గ్రామంలో నాకు సంబంధించిన వ్యవసాయ క్షేత్రంలో జరిగిన సంఘటనకు, నాకు ఎలాంటి సంబంధం లేదు. 2018 ఆ భూమి కొనుగోలు చేసిన తర్వాత దాని నిర్వహణ బాధ్యతలను నా మేనల్లుడు జాన్‌దేవ్ రెడ్డికి అప్పగించాను. ఇక్కడ మరో ముఖ్య విషయం. నా వ్యవసాయ క్షేత్రంలో ఎలాంటి నిర్మాణాలు లేవు. కేవలం వ్యవసాయ కూలీలు సేదదీరడం కోసం వేసిన రేకుల షెడ్లు మాత్రమే వున్నాయి. నా వ్యవసాయ క్షేత్రంలో కొబ్బరి తోట, మామిడి తోటలున్నాయి. నిరంతరం వ్యవసాయ పనుల కోసం వాడే పని ముట్లు దాచడం కోసం రేకుల షెడ్లు వినియోగిస్తారు. అక్కడ గెస్ట్ హౌస్ లేదు. ఫామ్ హౌస్ లేదు. కానీ కొందరు పని గట్డుకొని అసత్యాలన్నీ ప్రచారం చేస్తున్నారు.‌ కాకపోతే మా మేనల్లుడు నా సమాచారం లేకుండా సదరు తోటను వర్రా రమేష్ కుమార్ రెడ్డి అనే వ్యక్తికి కౌలుకి ఇచ్చినట్లు మాత్రమే తెలిసింది. అయితే రమేశ్ కుమార్ రెడ్డి అనే వ్యక్తి మరో వ్యక్తి ఎం. వెంకట పతి రాజుకు కౌలుకిచ్చారని నిన్ననే నా దృష్టికి వచ్చింది. వెలుగులోకి వచ్చిన విషయంలో సదరు వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని కూడా నేను స్వయంగా నిన్ననే పోలీసులకు ఫిర్యాదు కూడా చేయడం జరిగింది. అక్కడ జరిగిన సంఘటనలకు నాకు ఎలాంటి సంబంధం లేదు. సంఘటన జరిగిన రోజున హైదరాబాద్ లో కూడా లేను. వరంగల్ లో ఎల్లమ్మ పండుగ కార్యక్రమంలో వున్నాను. రాజకీయంగా నన్ను ఇబ్బంది పెట్టడానికే కొందరు నాపై దుష్పచారం మొదలుపెట్టారు. నేను భూ యజమానిని కావడం వల్ల పోలీసులు నాకు నోటీసులు జారీ చేశారు. నేను అందుకు సంబంధించిన వివరణ ఇస్తాను. పోలీసు విచారణకు సహకరిస్తాను.‌ అయితే మీడియా మిత్రులకు మనవి. ఎటువంటి ఆధారాలు లేకుండా అభూత కల్పనలతో కథనాలు ప్రసారం చేయొద్దు. సోషల్ మీడియాలో నాపై దుష్పచారం చేస్తున్న వ్యక్తులకు లీగల్ నోటీసులు పంపించడానికి వెనుకాడను. అని పోచంపల్లి తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!