ఐపిఏల్ బెట్టింగ్ తో జీవితాలు నాశనం చేసుకోవద్దు.

IPL betting

ఆన్లైన్ మరియు ఐపిఏల్ బెట్టింగ్ తో జీవితాలు నాశనం చేసుకోవద్దు.

చందుర్తి సిఐ జి. వెంకటేశ్వర్లు

చందుర్తి, నేటిధాత్రి:

 

క్రికెట్ బెట్టింగ్ లు చేసి డబ్బులు కోల్పోయి ఆర్థిక ఇబ్బందులకు లోనై ఎలాంటి అనర్థాలకు పాల్పడవద్దని చందుర్తి సిఐ జి. వెంకటేశ్వర్లు యువతకు పిలుపునిచ్చారు. స్థానిక ఠాణా లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ
దేశంలో ధనాధన్ ఆటగా పేరొందిన ఐపియల్ క్రికెట్ సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో యువత గెలుపు ఓటములు పై పందాలు కాయవద్దని అన్నారు. అలాంటి వాటికి పాల్పడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇటీవలి కాలంలో తేలికగా డబ్బు సంపాదించాలనే ఆశతో యువకులు ఆన్ లైన్ బెట్టింగులు, క్రికెట్ బెట్టింగ్ లు చేస్తూ నష్టపోయి వత్తిడి తట్టుకోలేక ఆత్మహత్యలకు పాల్పడుతూ తమ జీతాలను అర్థాంతరంగా చాలించడమే కాకుండా తల్లి దండ్రులకు కడుపుకోత మిగులుస్తున్నారని అన్నారు.ఐసీసీ నిర్వహించేది క్రికెట్ ఆటే కానీ బెట్టింగ్ తిమింగలాలకు అది ఫక్తు వ్యాపారం. పెద్దచేప రూపంలో చిన్న చేపలను మింగే ఆట. దీనిపట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రస్తుతం ఐపియల్ సీజన్ నడుస్తున్న పరిస్థితుల్లో తల్లిదండ్రులు పిల్లలను గమనిస్తూ ఉండాలని వారి ప్రవర్తనలో ఏదైనా మార్పులు కనబడితే తక్షణమే స్పందించండి.అంటిపెట్టుకుని ఉండండి.లేదంటే డబ్బు తోపాటు ప్రాణాలు కూడా కోల్పోయే ప్రమాదం ఉంది. అలాంటి సంఘటనలు చోటు చేసుకుంటే ఎవరు తీర్చలేని లోటవుతుంధని తెలిపారు.ఎవరైనా క్రికెట్ బెట్టింగ్ లకు పాల్పడితే పోలీసువారికి సమాచారం ఇవ్వాలని సిఐ G. వెంకటేశ్వర్లు కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!