వేములవాడ, నేటి దాత్రి:
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ ఎంతోమంది అమరుల త్యాగాల వల్ల, 13ఏండ్ల పాటు కోట్లాడి సాధించుకున్న తెలంగాణను దొంగల చేతిలో పెట్టవద్దని బి.ఆర్.ఎస్ పార్టీ వేములవాడ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి చల్మెడ లక్ష్మీ నరసింహా రావు పిలుపునిచ్చారు. గడపగడపకు గులాబీ జెండా కార్యక్రమంలో భాగంగా బుధవారం కథలపూర్ మండలం గంభీర్ పూర్, బొమ్మెన, దూలూరు, దుంపేట్ గ్రామాల్లో మార్క్ ఫెడ్ మాజీ చైర్మన్ లోక బాపురెడ్డితో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా చల్మెడ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ నాయకత్వంలో కోట్లాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకువెళ్తుందని, దేశంలోనే ఎక్కడ లేని విధంగా రైతు బంధు, రైతు భీమా, ఆసరా పెన్షన్లు, కళ్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ వంటి సంక్షేమ పథకాలను అందిస్తూ అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని అలాంటి రాష్ట్రాన్ని దొంగల చేతిలో పెట్టి, మోసపోయి, గోస పడొద్దని సూచించారు. సంక్షేమ ఫలాలు సక్రమంగా అందాలన్నా, రాష్ట్రం మరింత అభివృద్ధి చెందాలన్నా, పేద ప్రజల బ్రతుకుల్లో వెలుగులు నిండాలన్న మళ్ళీ ఒకసారి కారు గుర్తుపై ఓటేసి సీఎం కేసీఆర్ ను మూడోసారి ముఖ్యమంత్రిని చేయాలని, సేవ చేయాలనే ఆశయంతో వస్తున్న తనకు ఒక్కసారి అవకాశం ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ నాగం భూమయ్య, ఎంపీపీ జవ్వాజి రేవతి-గణేష్, మార్కెట్ కమిటీ చైర్మన్ గుండారపు సౌజన్య-గంగాధర్, వైస్ ఎంపీపీ కిరణ్ రావు, మార్కెట్ కమిటీ మాజీ ఛైర్మన్ వర్థినేని నాగేశ్వరరావు, కో-అప్షన్ సభ్యుడు ఎం.డి రఫీ, బి.ఆర్.ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు గడీల గంగప్రసాద్, ప్యాక్స్ చైర్మన్ గంగాధర్, వైస్ చైర్మన్లు శీలం మోహన్ రెడ్డి, మిట్టపల్లి లక్ష్మీ-గంగారెడ్డి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సోమ దేవేందర్, సర్పంచులు పోతు సింధూజ-రాజశేఖర్, పిడుగు లావణ్య-తిరుపతి, అంబాటి లత-పురుషోత్తం, ఎంపీటీసీలు నక్క లక్ష్మీ-నాగరాజు, మల్యాల రమేష్, ఎంపిటిసిల ఫోరమ్ మండల అధ్యక్షుడు బొడ్డు బాలు, రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు కేతిరెడ్డి మహిపాల్ రెడ్డి, బి.ఆర్.ఎస్ పార్టీ యూత్ అధ్యక్షుడు నల్ల గంగాధర్, విద్యార్థి విభాగం అధ్యక్షుడు చెక్కపల్లి రాజు కుమార్, ఓ.సి సెల్ అధ్యక్షుడు రొక్కం హరీష్ రెడ్డి, ఎస్సి సెల్ అధ్యక్షుడు అన్నారపు రమేష్ లతో పాటు ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపిటిసిలు, ఇతర ప్రజాప్రతినిధులు, గ్రామ శాఖ అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
*బి.ఆర్.ఎస్ పార్టీలో చేరిన కాంగ్రెస్, బీజేపీ నాయకులు
ప్రచారంలో భాగంగా ఆయా గ్రామాలకు వెళ్లిన చల్మెడ సమక్షంలో గంభీర్ పూర్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు, దుంపేట గ్రామానికి చెందిన బీజేపీ, కాంగ్రెస్ నాయకులు బి.ఆర్.ఎస్ పార్టీలో చేరారు. పార్టీలో చేరిన వారికి లక్ష్మీ నరసింహా రావు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
*నామినేషన్ డిపాజిట్ అందజేత
ప్రచారంలో భాగంగా దూలూరు గ్రామానికి వెళ్లిన చల్మెడకు స్థానిక మహిళలు ఎన్నికల నామినేషన్ డిపాజిట్ కొరకు రూ. 10వేల నగదును అందించి ఆశీర్వదించారు. ఎంత చిన్న పిల్లవాడు ఈ కార్యక్రమంలో జడ్పిటిసిలు, ఇతర గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు,