#రైతులకు సరిపడా నీళ్లు అందించండి.
#దళిత బంధు రెండో విడత వెంటనే విడుదల చేయాలి.
#హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి
వీణవంక ,(కరీంనగర్ జిల్లా)
నేటి ధాత్రి: వీణవంక మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి బిఆర్ఎస్ అధినేత కేసిఆర్ తో పాటు బిఆర్ఎస్ పార్టీపై కాంగ్రెస్ ప్రభుత్వం తన అక్కస్సును వెళ్లగకుతుందని, తమపై కోపంతో రైతులకు నీళ్లు ఇవ్వకుండా కెసిఆర్ ను బదనాం చేసే ప్రయత్నం చేయవద్దని హుజురాబాద్ టిఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. గురువారం వీణవంకలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో కెసిఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న పది సంవత్సరాలు రైతులకు చిన్న సమస్య రాకుండా చూసుకున్నారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన నెల రోజులు గడవక ముందే రైతులకు కష్టాలు మొదలయ్యాయని అన్నారు. ఇప్పటికే నాట్లు వేసుకొని ఎదురుచూస్తున్న రైతులకు పూర్తిస్థాయిలో నీళ్లు కూడా ప్రభుత్వం అందించలేకపోతుందని అన్నారు. పొలాలు,వాగుల దగ్గరకు వెళ్లి చూస్తే మొత్తం పర్రెలే కనిపిస్తున్నాయని అన్నారు. గత పది సంవత్సరాలుగా ఎన్నడూ లేనివిధంగా ఇప్పుడు కనిపిస్తున్నాయని అన్నారు. మార్పు రావాలి మార్పు తేవాలి అని చెప్పింది ఇదేనా అని ఆయన ప్రశ్నించారు. రైతుల కోసం ఇప్పటికే అనేక పర్యాయాలు ఇరిగేషన్ ఎస్సీతో మాట్లాడాలని అన్నారు. వీణవంకలోని బిఆర్ఎస్ నాయకులతోపాటు రైతులు ఇటీవలే కల్వల ప్రాజెక్ట్ వద్దకు కూడా వెళ్లారని అక్కడ కొద్దిపాటి నీళ్ళు మాత్రమే వస్తున్నాయని పూర్తిస్థాయిలో నీళ్లు వస్తేనే వ్యవసాయానికి అనుగుణంగా ఉంటుందని ఆయన అన్నారు. రైతులకు పూర్తిస్థాయిలో నీళ్లు అందించకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు. ఎన్నికల హామీలో భాగంగా రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఎకరానికి 15000 ఇస్తానని స్వయంగా ముఖ్యమంత్రి అన్నారని, అయిన ఇప్పటివరకు ఎందుకు ఇవ్వలేదో చెప్పాలన్నారు. వెంటనే రైతులందరికీ ఎకరానికి 15000 చొప్పున రైతుబంధు వేయాలని ఆయన డిమాండ్ చేశారు. అలాగే దళితుల అభ్యున్నతి కోసం పైలెట్ ప్రాజెక్టుగా హుజురాబాద్లో అమలు చేసిన దళిత బంధు కెసిఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నియోజకవర్గంలోని 18 వేల కుటుంబాలకు దళిత బంధు అందించామని అన్నారు. రెండో విడతలో భాగంగా ఇప్పటికీ 1500 నుంచి 2000 కుటుంబాలకు వారి ఎకౌంట్లో డబ్బులు జమ అయి ఉన్నాయని, వాటిని బ్యాంకు వారు ఫ్రిజ్ చేశారని, వెంటనే వాటిని దళిత కుటుంబాలకు అందించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వీణవంకలోని రోడ్డు కోసం గతంలోని 30 కోట్లతో మంజూరు చేశామని, శుక్రవారం పర్యవేక్షించి బీటీ కూడా వేయిస్తామన్నారు. ఎంపీపీ రేణుక, తిరుపతి రెడ్డి, సర్పంచ్ నీల కుమారస్వామి,గ్రామ అధ్యక్షుడు తాళ్లపల్లి మహేష్, వైస్ ఎంపీపీ లత,శ్రీనివాస్, మాజీ జడ్పిటిసి రాజమల్లయ్య, మల్లయ్య కొండల్ రెడ్డి, నీల పున్నం నాయకులు తదితరులు పాల్గొన్నారు.