
#18 న కలెక్టర్ లో ధర్నా,23 న చలో హైదరాబాద్.
నర్సంపేట,నేటిధాత్రి :
భవన నిర్మాణ కార్మికులకు కార్మిక వెల్ఫేర్ బోర్డు ద్వారా అందిస్తున్న సంక్షేమ పథకాలను ఇన్సూరెన్స్ కంపెనీలకు ఇవ్వరాదని బిఆర్టియు భవన నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి పాలడుగుల రమేష్,బిఆర్టియు జిల్లా అధ్యక్షులు గోనే యువరాజ్ అన్నారు.శుక్రవారం నర్సంపేట పట్టణంలోని సిఐటియు కార్యాలయంలో భవన నిర్మాణ అన్ని కార్మిక సంఘాలతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వెల్ఫేర్ బోర్డు ఏర్పడిన నాటినుండి వేల మందికి 8 రకాల సంక్షేమ పథకాలను వెల్ఫేర్ బోర్డు అందించిందని,నేడు ఆ బోర్డు సంక్షేమ పథకాలను బోర్డు ద్వారా కాకుండా ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలకు అప్పచెప్పాలని చూడడం దారుణం అన్నారు.బోర్డులో వేలకోట్ల రూపాయలు జమ అవుతున్న కార్మికులకు ఆ డబ్బులను ఖర్చు చేయకుండా వెల్ఫేర్ బోర్డు కార్మిక శాఖ రాష్ట్ర ప్రభుత్వం తమ ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ సంక్షేమ పథకాలను పెంచకుండా కార్మికులకు పూర్తిస్థాయి బీమాలు అందజేయకుండా నిర్లక్ష్యం చేస్తూ ఉన్న సంక్షేమ పథకాలను నీరుగారిచే విధంగా బోర్డు అధికారులు ఈ ప్రభుత్వం చూస్తున్నారని ఆరోపించారు. బోర్డులో ఉన్న డబ్బులు కార్మికుల కోసం కాకుండా ఆఫీసు ఆర్భాటాల కోసం ఖర్చు చేస్తున్నారని అందులో భాగంగానే 100 కోట్ల రూపాయలు ఆఫీసు నిర్వహణ కోసం వెల్ఫేర్ బోర్డు నుండి తీయటం సరైంది కాదన్నారు. ఇన్సూరెన్స్ కంపెనీలకు వెల్ఫేర్ బోర్డు ద్వారా ఇస్తున్న సంక్షేమ పథకాల నుండి నాలుగు సంక్షేమ పథకాలను కంపెనీలకు అప్పచెప్పడం మూలంగా కార్మికులు నష్టపోతారని ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలు అనేక సాకులు చూపి కార్మికులకు భీమలు సంక్షేమ పథకాలు అందించకుండా నీరుగార్చే ప్రమాదం ఉందని అందుకోసం రాష్ట్ర ప్రభుత్వమే తగు చర్యలు తీసుకొని ఆగస్టు 21న విడుదల చేసిన నోటిఫికేషన్ రద్దుచేసి బోర్డు ద్వారానే భవన నిర్మాణ కార్మికులకు సంక్షేమ పథకాలు వర్తింప చేయాలని డిమాండ్ చేశారు. బోర్డులో జరుగుతున్న అవినీతి అక్రమాలకు అడ్డుకట్ట వేయాలని కార్మికుల పెండింగ్ ఉన్న సంక్షేమ పథకాలను విడుదల చేసి కార్మిక సంక్షేమానికి తోటపాటను అందించాలని కోరారు.వెల్ఫేర్ బోర్డులో గిగ్గు కార్మికులను చేర్చరాదని, గిగ్గు కార్మికులకు భవన నిర్మాణ కార్మికులకు ఎలాంటి సంబంధం ఉండదని అలాంటప్పుడు గిగ్గు కార్మికులను వెల్ఫేర్ బోర్డులో ఎలా చెరుస్తారని అడిగారు. భవన నిర్మాణ కార్మికులు నిర్మాణాలు చేస్తున్న సమయంలో వచ్చే సెస్ వెల్ఫేర్ బోర్డులో జమవుతుందని ఆ డబ్బులు తిరిగి కార్మికుల సంక్షేమానికి ఖర్చు చేస్తున్నారని అలాంటప్పుడు గిగ్గు కార్మికులు ద్వారా వెల్ఫేర్ బోర్డుకు ఎలాంటి సెస్ లు రావని, అలాంటప్పుడు బోర్డులో వారిని కలపడం సరికాదన్నారు.వెల్ఫేర్ బోర్డు ప్రకటించిన టెండర్ ను వెంటనే రద్దు చేయాలని లేని పక్షంలో కార్మికులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగుతారని హెచ్చరించారు. ఈ నెల 18న జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు జరిగే ధర్నాను అదేవిధంగా ఈనెల 23న చలో హైదరాబాద్ కమిషనర్ కార్యాలయం ముందు జరిగే ఆందోళనకు రాష్ట్రంలో ఉన్న భవనిర్మాణ కార్మికులు పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో హమాలీ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కొల్లూరు లక్ష్మీనారాయణ, సిఐటియు జిల్లా నాయకులు కందికొండ రాజు, ఏఐఎఫ్టీయూ జిల్లా నాయకులు కుమార్,బిఆర్టియు నాయకులు నేరెళ్ల బిక్షం, రాజు, రాజశేఖర్, కుమార్, రాజేందర్, గరికపాటి రామ్మోహన్, విరసారపు రాజకుమార్, అనిల్ కుమార్, సంపత్,రవి,గడ్డం,సత్యం,రాజు జీవన్ తదితరులు పాల్గొన్నారు.