
District Collector.
గంజాయి డ్రగ్స్ కు బానిస అవ్వద్దు..
• ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి..
• గ్రామాల్లో కళాజాత అవగాహన
నిజాంపేట: నేటి ధాత్రి
యువత గంజాయి ,డ్రగ్స్ కు బానిసై తమ బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని, ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సాంస్కృతిక కళాసారథి బృందం గ్రామాల్లో అవగాహన కార్యక్రమం చేపట్టారు. ఈ మేరకు నిజాంపేట మండలం చల్మెడ గ్రామంలో మంగళవారం గ్రామస్తులకు పాటలు రూపంలో అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. జిల్లా కలెక్టర్, పౌర సంబంధాల శాఖ ఆదేశాల మేరకు ప్రతి గ్రామంలో ప్రభుత్వ పథకాలతో పాటు, యువత చెడు మార్గం పెంచుకోవద్దని దానిపై అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు. బడిబాట కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ బడులలో ఒక పిల్లలను పంపించాలన్నారు. ప్రభుత్వ బడుల ఆవశ్యకతను ప్రజలకు పాటల రూపంలో వివరించడం జరిగిందన్నారు. కార్యక్రమంలో టీం కోఆర్డినేటర్ శివోల్లా కృష్ణ, రామారావు, ఎల్లయ్య నరసయ్య, సిద్ధులు ఎల్లయ్య, శేఖర్, విజయలక్ష్మి, మాధవి లు ఉన్నారు.