కేసిఆర్‌ బాటలో బాబు నడవకు!

https://epaper.netidhatri.com/view/307/netidhathri-e-paper-2nd-july-2024%09

-కష్టపడిన వారికే అవకాశాలు ఇవ్వండి!

-ఐదేళ్ళు అరిగోస పడిన వారిని ఎంపిక చేయండి.

-అధికారంలో వున్నప్పుడు అందరూ చేరుతారు.

-అధికారం పోగానే స్వార్థపరులు జారిపోతారు!

-అలాంటి వారిని అక్కున చేర్చుకోవద్దు.

-అందలమెక్కించొద్దు.

-చెరువు నిండగానే కప్పలు వస్తాయి. ఎండిపోతే వెళ్లిపోతాయి.

-అసలైన నాయకులు ఎల్లకాలం పార్టీతోనే వుంటారు.

-కష్టకాలంలో పార్టీకి అండగా నిలుస్తారు.

-అవకాశవాదులు అప్పటికప్పుడు పుట్డుకొస్తారు.

-లేని పోని గొప్పలు చెప్పి పబ్బం గడుపుకుంటారు.

-పార్టీ కోసం సర్వం కోల్పోయిన వారున్నారు.

-వారికి సరైన అవకాశాలు ఇస్తే పార్టీకి కంచుకోటలా నిలబడతారు.

-పదవుల పంపకాలలో వారికే ప్రాధాన్యతనివ్వండి.

-పార్టీ అవసరాలంటూ పనికి రాని వారిని అందలమెక్కించకండి.

 

తెలుగుదేశం పార్టీ అభిమానులు ఎక్కడున్నా ఒక్కటే. తెలుగు ప్రజల ఆశాకిరణం తెలుగుదేశం పార్టీ. ఇప్పుడు ఏపిలో మళ్లీ అదికారంలోకి వచ్చింది. దాంతో ఆ పార్టీ శ్రేణులు పార్టీ అధినేతకు కొన్ని సూచనలు చేస్తున్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత కేసిఆర్‌లా మారకూడదని కోరుకుంటున్నారు. ఎందుకంటే తెలంగాణ ఉద్యమ సమయంలో కేసిఆర్‌ కోసం, బిఆర్‌ఎస్‌ కోసం కొన్ని లక్షల మంది కార్యకర్తలు పనిచేశారు. కొన్ని వేల మంది నాయకులు ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లారు. పార్టీకి అండగా నిలిచారు. 2014 ఎన్నికల్లో కేసిఆర్‌ గెలుపుకు విశేష కృషిచేశారు. కాని ఏం లాభం. పార్టీ కోసం పనిచేసిన ఎంతో మంది నాయకులను పక్కన పెట్టి కేసిఆర్‌ ఇప్పుడు తన పతనం తానే చూస్తున్నాడు. తన ఓటమికి తన స్వయంకృతాపరధామే కారణం చేసుకున్నాడు. కష్టకాలంలో పార్టీకి అండగా నిలిచిన వారిని వదిలేశాడు. వారిని పట్టించకోవడం మానేశాడు. కొత్తగా పార్టీలోకి వచ్చినవారికి అవకాశాలు కల్పించాడు. వారిని అందలమెక్కించాడు. పార్టీ కోసం పద్నాలుగేళ్లు పని చేసిన వారిని పక్కన పెట్టాడు. దాంతో ఇప్పుడు ఫలితం అనుభవిస్తున్నాడు. పదేళ్ల కాలంలో కూడా పదవులు దక్కని ఎంతో మంది బిఆర్‌ఎస్‌ నేతలు వలవల ఏడుస్తున్నారు. కేసిఆర్‌ కోసం సర్వం కోల్పోయామని మధనడపడుతున్నారు. ఆస్దులమ్మి పార్టీకి సేవ చేస్తే తమకు మిగిలేందేమిటని కేసిఆర్‌ను తూర్పారపడుడుతున్నారు. అధికారంలో వున్నంత కాలం ముందు ముందు అవకాశాలు వస్తాయంటూ కాలయాపన చేశాడు. నాయకులను మభ్యపెడుతూ వచ్చాడు. దాంతో నాయకులు కూడా గత ఎన్నికల్లో పనిచేయలేదు. వదిలేశారు. అందువల్ల ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈసారి పార్టీ శ్రేణులు ఎంతో కష్టపడితే గాని ఇంతటి మెజార్టీ వచ్చింది. అందుకే పార్టీ కోసం ఆనాటి నంచి నేటి వరకు పార్టీని పట్టుకొని, గతంలో పదవులు రాని వారిని గుర్తించి పదవులు ఇవ్వండి. గతంలో పదవులు అనేక సార్లు అనుభవించినా వారిని సంతృప్తిపర్చేందుకో, లేక పార్టీలోకి కొత్తగా వచ్చిన వారికి పదవులు పంపకాలు చేయకండి. పార్టీతో ఇప్పటి వరకు లబ్దిపొందని ఎంతో మంది నాయకులు వున్నారు. తెలుగుదేశం పార్టీ అదికారంలోకి వచ్చిన ప్రతిసారి పదవుల కోసం ఎదురుచూసి, చూసి, మళ్లీ మళ్లీ పార్టీ కోసం పనిచేస్తూనే వున్నవాళ్లున్నారు. వారికి ఈసారి ఎలాగైన పదవులు అందించాల్సిన అవసరం వుంది. ఇక గతమంతా ఒక ఎత్తు. గత ఐదేళ్లు ఒక ఎత్తు. గడచిన ఐదేళ్ల కాలంలో తెలుగుదేశం పార్టీ నాయకులు అనుభవించినంత వేదన ఎప్పుడూ అనుభవించలేదు. అన్ని నిర్భంధాలను ఎప్పుడూ ఎదుర్కొలేదు. ఒక్కొ నాయకుడు అన్నన్ని కేసుల్లో లేరు. ఎంతో మంది నాయకులు జైలు జీవితం అనుభవించారు. కేసులకు తిరుగుతున్నారు. ఆస్ధులు అమ్ముకున్నారు. పార్టీ కోసం పనిచేశారు.

పార్టీ అధికారంలో లేనప్పుడు చంద్రబాబు వైపు చూడని వాళ్లు కూడా ఇప్పుడు చేరేందుకు ముందుకొస్తారు. చంద్రబాబును ఆకాశానికెత్తేస్తుంటారు. అందులో ఆర్ధిక సంపనులు చాల మంది వుంటారు. ఇప్పుడు మాయ మాటలు చెప్పి చంద్రబాబును కూడా సంతృప్తి చెందేలా చూస్తుంటారు. కాని పార్టీ అధికారంలో లేనప్పుడు ఆస్దులు కోల్పోయిన నేతలను కాదని, ఇప్పుడు తెల్ల బట్టలు వేసుకొని వచ్చేవారకి ఎట్టి పరిస్ధితుల్లో ప్రాదాన్యతనివ్వకూడదు. అసలు అలాంటి వారిని అక్కున చేర్చుకోవద్దు. అలాంటి వారికి అవకాశాలు కల్పించొద్దు. వారిని అసలు దరి చేరనివ్వొద్దు. ఎందుకంటే అలా వచ్చిన వారు అవకాశవాదులు. పార్టీ బలోపేతానికి ఇప్పుడు వాళ్లు చేసేదేమీ వుండదు. పార్టీ జెండా మోయలని వారు, పార్టీ కోసం జిందాబాద్‌లు కొట్టని వారు, వాళ్లకు జేజేలు కొట్టించుకునేందుకు చేరుతారు. పార్టీలో నాయకులుగా చెలామణి కావాలని చూస్తారు. అలాంటి నాయకులు ఎలాంటి స్వార్ధం లేకుండా పార్టీలో చేరరు. తమ ఆర్ధిక బలాలు పెంచుకోవడం కోసమో, చెట్టు పేరు చెప్పి కాయలమ్ముకోవడం కోసమో వస్తారు. అంతే కాని పార్టీ మీద ప్రేమతో రారు. పార్టీ కోసం పనిచేసేందుకు మాత్రం కాదు. పార్టీ కోసం పనిచేసేవాళ్లంతా అధికారంలో వున్నప్పుడు సేవ చేస్తారు. పార్టీ అధికారంలోకి వస్తే చాలు అని అనుకుంటారు. కాకపోతే పార్టీ నుంచి పదవులు ఆశించడం తప్పు కాదు. రాజకీయాలు చేస్తూ, పదవులు లేకుండా వుండడం బావ్యం కూడా కాదు. అందుకే పార్టీకోసం పని చేసిన వారిని గుర్తించండి. పదవుల పందేరానికి అంత తొందరేమీ లేదు. కొంత ఆలస్యమైనా సరే..అసలైన నాయకులకు పదవులు ఇవ్వండి. పార్టీ కోసం ప్రాణం పెట్టిన వారిని గుర్తించి, పదవులు అందించండి. కాని వారిని అందలమెక్కించొద్దు. చెరువు నిండగానే కప్పలు చేరినట్లు నాయకులు వస్తారు. అయినంత మాత్రాన వాళ్లు పార్టీ కోసం పనిచేస్తారని చెప్పలేం. పార్టీని పట్టుకొని వేళాడతారని అనుకోలేం. పార్టీ అదికారంలో వుంటేనే వుంటారు. లేకుంటే వెళ్లిపోతారు. మళ్లీ తమ దారి తాము చేసుకుంటారు. అలాంటి వారితో పార్టీకి ఎప్పటికైనా ప్రమాదమే. పార్టీ కోసం అహర్నిషలు పనిచేసేవారికి అవకాశాలిస్తే మరో నలభై ఏళ్లు పార్టీకి కంచుకోటగా పనిచేస్తారు. అందుకే పదవుల్లో అలాంటి నాయకులు ఎంతో మంది వున్నారు. వారికి మాత్రమే ప్రాదాన్యతన్విండి. కేసిఆర్‌ పదేళ్లకాలంలో ఎంతో మంది తెలంగాణ వాదులను పక్కన పెట్టి తప్పు చేశారు. ఓడిపోయి ఇప్పుడు తెల్లమొహం వేసుకున్నాడు. అధికారంలో వున్నప్పుడే నిజానికి క్యాడర్‌ను కాపాడుకోవాలి. కడుపులో పెట్టుకొని చూసుకోవాలి. వాళ్లే పార్టీకి బలమైన పునాదులు. రేపటి రోజు లోకేష్‌ నాయకత్వానికి అండగా నిలిచే యోధులు. తెలుగుదేశం పార్టీలో ఎంతో మంది కొన్ని దశబ్దాలుగా పార్టీకి ఎనలేని సేవలు చేస్తున్నావారున్నారు. ఐదేళ్ల కాలం పాటు ఎన్నొ ఒడిదొడుకులు ఎదుర్కొన్నవాళ్లు అనేకం వున్నారు. పార్టీకోసం శక్తి వంచన లేకుండా కాపాడడంలో కృషి చేస్తూనేవున్నారు.. వైసీపి ఐదేళ్ల పాలనలో ఎన్ని నిర్భంధాలనైనా లెక్క చేయని నాయకులున్నారు. వాళ్లు ఎవరికీ భయపడిరది లేదు. వారిపై జగన్‌ ప్రభుత్వం ఎన్ని కేసలు నమోదు చేసినా బెదిరిపోలేదు. ఏ ఒక్కరూ అదిరిపోలేదు. అడుగడుగునా వైసిపి నేతలు చేసిన బెదిరింపులకు ఎంతో మంది తెలుగుదేశం శ్రేణులు భయపడలేదు.

నిత్యం వైసిపి నేతలు అదిరించినా ఎంతో మంది తెలుగుదేశం సైనికులు వైసిపికి వ్యతిరేకంగా పోరాటం చేశారే గాని పారిపోలేదు. వైసిసిని ధైర్యంగా ఎదిరించారు. వైసిసికి వ్యతిరేకంగా ఉద్యమాలు సాగించారు. తెలుగుదేశం పిలుపునిచ్చిన అనేక కార్యక్రమాల్లో పాలుపంచుకున్నారు. జగన్‌ ప్రభుత్వం సృష్టించిన అడ్డంకులన్నీ చేధించుకుంటూ ఏపి మొత్తం పార్టీ బలోపేతం కోసం అనేక పోరాటాల్లో ప్రత్యక్షంగా పాల్గొన్నారు. తెలుగుదేశం శ్రేణులపై ఎన్ని కేసులు నమోదైనా సరే వైసిపి మీద పోరాటం ఆపలేదు. ఏ క్షణంలో ఏం జరుగుతుందో తెలియని పరిస్ధితులను కూడా మొక్కవోని ధైర్యంతో ఎదుర్కొన్న నాయకులు వేలల్లో వున్నారు. చంద్రబాబును మళ్లీ ముఖ్యమంత్రిని చేయాలని, పార్టీ కోసం నిలబడిన అనేక మంది నాయకులు తమ జీవితాలలో సర్వం త్యాగం చేసిన వారున్నారు. మళ్లీ పార్టీ అదికారంలోకి రావాలిని తెలుగుదేశం శ్రేణులందరూ ఎంతో కృషి చేశారు. తెలుగుదేశం జెండా తెలుగునాట ఎరగరాలని తాపత్రయపడ్డారు. చంద్రబాబు కోసం పని చేశారు. మళ్లీ చంద్రబాబు పాలన కావాలని ప్రజలను చైతన్యం చేశారు. పార్టీని బలోపేతం చేశారు. చంద్రన్న స్వర్ణయుగ పాలన సాగాలని, నవ్యాంధ్ర రూపు దిద్దుకోవాలని కోరుకున్నారు. ఏపి రాజకీయాలలో అడుగడుగునా ఎదురౌతున్న అవాంతరాల దాటుకుంటూ వెళ్లారు. అనేక అవమానాలు, వేధింపులు భరించారు. ఇబ్బందులు తట్టుకున్నారు. అయినా తెలుగుదేశం శ్రేణులు ఎక్కడా వెనకుడుగు వేయలేదు. భయపడలేదు. ఐదేళ్లపాటు అను నిత్యం ఐదేళ్లపాటు అనునిత్యం ఏదో ఒక రూపంలో పోరాటం చేశారు. పైగా కరోనా లాంటి సమయాల్లో తెలుగుదేశం శ్రేణులు అనేక మంది ఎనేక సహాయ సహకారాలలో పాలుపంచుకున్నారు. ప్రజలకు దైర్యంచెప్పారు. వారి అసరాలు తీర్చారు. తమకు వున్నదాంట్లో ఎంతో మందికి సేవ చేశారు. ఐదేళ్లపాటు అష్టకష్టాలు ఎదురైనా ఓర్చుకున్నారు . గుండె నిబ్బరంతో తెలుగుదేశం జెండా రెపరెపలాడిరచడంలో ముందున్నారు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *