ఓటర్లు డబ్బు మద్యం ప్రలోబాలకు లొంగొద్దు
• నిజాయితీగా ప్రజాసేవ చేసేవారికే ఓటు వెయ్యాలి
•సమాచార హక్కు వికాస సమితి(అర్టిఐ) చేవెళ్ల మండల సెక్రటరీ మంగలి ఆంజయ్య
చేవెళ్ల, నేటిధాత్రి :
స్థానిక ఎన్నికల్లో అభ్యర్థులు అధికంగా ఖర్చు పెట్టి అప్పుల పాలు కావద్దని సమాచార హక్కు వికాస సమితి(అర్టిఐ) చేవెళ్ల మండల సెసెక్రటరీ మంగలి ఆంజయ్య అన్నారు. ఈ సందర్బంగా మండలంలో సర్పంచి, వార్డు నెంబర్లుగా పోటీచేస్తున్న అభ్యర్థులు డబ్బులతో ఏకగ్రీవం చేసుకోవడానికి ప్రయత్నంలో ఉన్న అభ్యర్థులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. అభ్యర్థులు స్థానిక ఎన్నికల్లో గెలవడానికి ముందుగా ఎన్నికల్లో ఓటర్లకు మద్యం, విందు కార్యక్రమాలకు ఖర్చు చేసే డబ్బులు గెలిచిన తరువాత ప్రభుత్వం గ్రామపంచాయతీకి విడుదల చేసే నిధుల నుండి ఖర్చును పూడ్చుకునే అవకాశం సాధ్యం కాదనీ సమాచార హక్కు వికాస సమితి ముందుగా హెచ్చరిక తెలియజేస్తుందని అన్నారు. గ్రామానికి వచ్చిన నిధులను పనులు నిమిత్తం మాత్రమే పారదర్శకంగా ఖర్చు చెయ్యాలని సమాచార హక్కు చట్టం ప్రకారంగా పంచాయతి రాజ్ శాఖ సర్కులర్ 7240
ప్రకారంగా ప్రతీ విషయం ప్రజలందరూ తెలుసుకునే హక్కు ఉందని ప్రజలు తెలుసుకోవాలని పేర్కొన్నారు. పంచాయతి రాజ్ శాఖ సర్కులర్ 7240 ను ప్రతి గ్రామపంచాయతీ కార్యాలయంలో సూచిక బోర్డు పై ప్రజలందరికీ తెలిచేలా ఏర్పాటు చెయ్యాలని అన్నారు .
నిధులను పక్కదారి పట్టించిన దుర్వినియోగం చేసినా,
సొంతానికి వాడుకున్న, తప్పుడు లెక్కలు చూపిన ప్రజలు ఆధారాలతో ఫిర్యాదు చేసినప్పుడు జిల్లా కలెక్టర్ విచారణ జరిపించి, నిధులను రికవరీ చేసి, పదవి నుండి తొలగించె అవకాశం ఉందని, కాబట్టి ఎన్నికల్లో అధిక ఖర్చులు పెట్టి అప్పుల పాలు కావద్దని సూచించారు. ఓటర్లు డబ్బు, మద్యం, ప్రలోబాలకు లొంగి ఓటు వేయొద్దని, నిజాయితీగా ప్రజాసేవ చేసేవారికే ఓటు వెయ్యాలని ఓటర్లకు సూచించారు.
