– కాంగ్రెస్ ప్రభుత్వం అందర్నీ కలుపుకొని పనిచేయాలి
– రైతులను ఆదుకోండి
– కౌశిక్ రెడ్డి పై కేసు చేయడం సరికాదు
– నిబంధనల ప్రకారం భూములు కొనుగోలు చేశారు
సిరిసిల్ల(నేటి ధాత్రి):
రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల పట్టణ ప్రెస్ క్లబ్లో బి.ఆర్.ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. బిఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు జిందం చక్రపాణి మాట్లాడుతూ సిరిసిల్ల నియోజకవర్గంలో అరెస్టుల పర్వం అనేది కరెక్ట్ కాదని అన్నారు. కక్షపూరితమైనటువంటి చర్యలు సరికాదని అన్నారు. అధికారులను అడ్డం పెట్టుకొని కేవలం టిఆర్ఎస్ నాయకులను మాత్రమే అరెస్టులు చేస్తున్నారని అన్నారు.
పది సంవత్సరాల కిందటనే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వ నిబంధనల ప్రకారం భూములను కొనుక్కోవడం జరిగిందని అన్నారు. సిరిసిల్ల నియోజకవర్గానికి చెందిన కోడి అంతయ్య మరియు బండి దేవదాసును హైదరాబాద్ లో ఉన్న సమయంలో అక్కడికి వెళ్లి మరి అరెస్టులు చేయడం అనేటువంటిది సరికాదని అన్నారు. సమాచారం ఇస్తే వెళ్లే వచ్చి కలిసే వారని అన్నారు. వీళ్ళను కరుడు కట్టిన తీవ్రవాదులు లాగా పోలీసులు భావించి లొకేషన్ తెలుసుకొని హైదరాబాద్ వెళ్లి మరి అరెస్టులు చేయడం అనేటువంటిది సరికాదని సమాచారం ఇస్తే వీళ్లే వచ్చి కలిసే వాళ్ళని చక్రపాణి అన్నారు. ఈ కక్షపూరితమైనటువంటి చర్యలు సరికాదని అన్నారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య మాట్లాడుతూ హుజరాబాద్ శాసనసభ్యులు పాడి కౌశిక్ రెడ్డి ఎలాంటి తప్పు చేయలేదని వీరి పైన కేసు బుక్ చేయడం అనేటువంటిది ప్రభుత్వానికి సరికాదని అన్నారు. టిఆర్ఎస్ టికెట్ ఇస్తేనే ఎమ్మెల్యేగా గెలిచి ఇప్పుడు కాంగ్రెస్ లో చేరడం కరెక్ట్ కాదని కౌశిక్ రెడ్డి ప్రశ్నించడం తప్పు కాదని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కక్షపూరితంగా కేసు పెట్టడం సరికాదని అన్నారు. ఇలాంటి కక్షపూరిత చర్యలు కాంగ్రెస్ ప్రభుత్వం మానుకోవాలని హితవు పలికారు.
ఈ సందర్భంగా నాఫ్స్కాబ్
కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ కొండూరి రవీందర్ రావు, మాట్లాడుతూ
నిన్నటి రోజున కరీంనగర్ లో జరిగినటువంటి సమావేశానికి
అధికారిక నిబంధనల ప్రకారం నాకు ఆహ్వానం ఉంది కానీ నాకు సమాచారం ఇవ్వలేదని అన్నారు.
ప్రభుత్వం పరిపాలిస్తున్న తీరు చాలా బాధాకరమని అన్నారు.
బీఆర్ఎస్ పాలనలో అందరికీ సమాన గౌరవం ఇచ్చామని అన్నారు.
అధికార పార్టీ నేతలకు మాత్రమే నిధులు ఇస్తున్నారని అన్నారు.
డైవర్షన్ పలైటిక్స్ మానుకోవాలని అన్నారు.
ప్రజలకు ఇచ్చిన హామీల అమలు పై దృష్టి పెట్టాలని అన్నారు.
గతంలో కాంగ్రెస్ పాలనలో అన్ని పార్టీ లను కలుపుకపోయేదని అన్నారు.
రాబోవు నాలుగేళ్లలో కాలయాపన చేయకుండా ప్రజల కోసం పని చేయలని అన్నారు.అధికారులను అడ్డు పెట్టుకుని
ప్రజలను ఇబ్బందులు పెట్టడం మానుకోవాలని అన్నారు.
ఏడాది గడుస్తున్న ఒక్క పని కూడా చేయలేదని అన్నారు.
జూటా మాటలతో కాలం ఎల్లదీస్తున్నారు.
రాజ్యాంగం గురించి చెప్తూనే టిపిసిసి అధ్యక్షుడు బి.ఆర్.ఎస్ నుండి వలసలు ఉన్నాయని మాట్లాడడం సరికాదని అన్నారు.రాజకీయ నాయకులు ఏ విధంగా ఉండాలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ పార్టీ ఫిరాయింపులు ఏంటని ప్రశ్నించారు.
అధికారం వచ్చిందని భ్రమలో ఉండవద్దని అన్నారు.ఇప్పటికైనా మీ వైఖరి మార్చుకోవాలని అన్నారు.
వ్యవసాయానికి నీళ్ళు ఎట్లా ఇవ్వాలి, ఎరువులు ఎలా ఇవ్వాలో ఆలోచన చేయండని అన్నారు.
నా సొంత ఊర్లోనే ఎరువులను లారి లో వచ్చి అమ్ముతున్నారని అన్నారు.
బీఆర్ఎస్ పాలనలో వ్యవసాయానికి అన్ని పంటలకు సాగు ననీరు ఇచ్చామని అన్నారు.కేసీఆర్ పాలనలో దేశంలోనే అగ్రగామిగా తెలంగాణ నిలిచిందని అన్నారు.
ఈ కార్యక్రమంలో బి ఆర్ ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య, నాఫ్స్కాబ్
కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ కొండూరి రవీందర్ రావు,బి ఆర్ ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు జిందం చక్రపాణి,గూడూరి ప్రవీణ్,సెస్ డైరెక్టర్ ధర్నాo లక్ష్మీనారాయణ, సత్తార్, గుండ్లపల్లి పూర్ణచందర్,మ్యాన రవి, వెంగళ శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు