అధైర్య పడకండి అండగా ఉంటా

లబ్ధిదారులందరికీ వెంటనే దళిత బంధు ఇవ్వాలి

హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి

జమ్మికుంట (కరీంనగర్ జిల్లా), నేటిధాత్రి :

దళిత బంధు రెండో విడత రాలేదని ఎవరూ అధైర్యపడి ఎలాంటి అఘాయిత్యాలకు పాల్పడకూడదని, దళితులందరికీ అండగా ఉంటానని హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. మంగళవారం దళిత బంధు రాలేదని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన శ్రీనివాస్ ఇంటి వద్దకు వెళ్లి ఆయనను పరామర్శించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, దళిత బంధు పథకాన్ని తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పైలెట్ ప్రాజెక్టుగా హుజురాబాద్ నియోజకవర్గంలో ఎంపిక చేసి నియోజకవర్గంలోని దళితులందరికీ సుమారు 18 వేల పై చిలుకు కుటుంబాలకు దళిత బంధు పది లక్షల రూపాయలు వారు ఎకౌంట్లో వేశారని, 14,000 మందికి ఇప్పటికే 10 లక్షలు అందాయన్నారు. మిగిలిన 4 వేల కుటుంబాలకు రెండో విడత దళిత బంధు ఇవ్వాల్సి ఉందని వెంటనే వారందరికీ రెండవ విడత దళిత బంధు ఇవ్వాలని డిమాండ్ చేశారు. దళితుల దళిత బంధు అకౌంట్ లను ఎందుకు ఫ్రీజ్ చేశారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఫ్రీజింగ్ లో ఉన్న అకౌంట్లను వెంటనే ఫ్రీజ్ ఎత్తివేసి, దళితుల అకౌంట్లో ఉన్న డబ్బులను రెండో విడతగా వెంటనే ఇవ్వాలన్నారు. నియోజకవర్గంతో పాటు రాష్ట్రంలోని దళితులందరికీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం 12 లక్షలు ప్రతి నియోజకవర్గంలోని దళితులకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే కలెక్టర్ రివ్యూ మీటింగ్ తో పాటు ఇంచార్జ్ మంత్రికి కూడా దళిత బంధు ఇవ్వాలని విజ్ఞప్తి చేశామని అన్నారు. దీంతోపాటు దళిత బంధు దళితులందరికీ ఇవ్వాలంటూ కలెక్టర్ తో కూడా ఫోన్లో సంభాషించానన్నారు. దీనిపై స్పందించిన కలెక్టర్ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి సమస్య పరిష్కారం అయ్యేలా చూస్తామని హామీ ఇచ్చారని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి వెంట ఆయన సతీమణి షాలినిరెడ్డి, జమ్మికుంట చైర్మన్ తక్కళ్లపల్లి రాజేశ్వరరావు, వైస్ చైర్మన్ దేశిని స్వప్నకోటి, పిఏసిఎస్ చెర్మన్. పొనగంటి సంపత్, పట్టణ అధ్యక్షుడు టంగుటూరి రాజ్ కుమార్ కౌన్సిలర్లు, బిఆర్ఎస్ నాయకులు, తదితరులు ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *