Don’t Sell Cotton to Middlemen: Sohel Warns Farmers
దళరులకు పత్తి అమ్మి మోసపోకండి….!
– షేక్ సోహెల్ బిఆర్ఎస్ యువ నాయకులు
జహీరాబాద్ నేటి ధాత్రి:
రైతులను ఆదుకోవాడని రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని, ఆకాల వర్షాల వల్ల రైతుల పంటలు నష్ట పోయరని పంటలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వలు మద్దతు ధరను ప్రకటించాయని ఝరాసంగం మండల తుమ్మన్ పల్లి గ్రామ షేక్ సోహెల్ బిఆర్ఎస్ యువ నాయకులు పేర్కొన్నారు. ఝరాసంగం మండల వ్యవస మార్కెట్ దళరుల బెడుద ఎక్కువైయిదన్నారు. వ్యవస మార్కెట్ కమిటీ వెంటనే స్పందించి దళారుల పై చెర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పత్తి ధరను నిర్ణయించి 8100 క్వింటాల్ కు కల్పించిందని తెలిపారు. పేట మార్కెట్ కమిటీ దళారులకు మేలు రకం పత్తికి 8100 రూ.. నాసిరకం పత్తికి 7500 ఇచ్చేల చెర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. దళారులు తక్కువ ధరకు పత్తి కొనుగోలు చేస్తే వారి లైసెన్స్ రద్దు చేయాలన్నారు. అధికార ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం కట్టుభడి ఉందని తెలిపారు. మునిపల్లి వ్యవస మార్కెట్ లో సరైయిన ధరను రైతులు పొందు తున్నారన్నారు. అక్కడి దళరులు కూడా ఇదే పత్తి కి 7500 వందలు మద్దతు ఇస్తున్నారని పేర్కొన్నారు. పేటలో వ్యవస్థ మార్కెట్ దళారులతో ఒప్పందం చేసుకొని రైతులకు నష్టం చేయటం మానుకోవాలని పేర్కొన్నారు. కౌలు రైతులకు సిసిఐ అవకాశం కల్పించాలని పేర్కొన్నారు. సిసిఐ అవకాశం ఇస్తే దళారుల దోపిడీ తగ్గు తుందని అన్నారు. రైతుల అవసరాలను అసగా చేసుకొని దొచేస్తున్నారు. రైతుల పక్షణ రాజకీయం పార్టీలు పోరాటం చేయాలన్నారు. త్వరలో పత్తి మార్కుట్ లో దళరుల ప్రమేయం తగ్గించాలని ఉద్యమం చేయనున్నామని తెలిపారు.
