MLA Manik Rao Urges to Vote for BRSP Candidate
కాంగ్రెస్ ని నమ్మి మోసపోకండి 6గ్యారంటీ ల పేరుతో అన్ని మోసలే అన్ని అబద్దాలే
:— ఎమ్మెల్యే మాణిక్ రావు
జహీరాబాద్ నేటి ధాత్రి:
సర్పంచ్ ఎలక్షన్ సందర్భంగా ఝరసంఘం మండల కేంద్రం లో బి ఆర్ ఎస్ పార్టీ బలపరచిన అభ్యర్థి వినోద — బాల్ రాజ్ & వార్డ్ మెంబర్ ల తరఫున ప్రచారం నిర్వహించిన శాసనసభ్యులు కొనింటి మాణిక్ రావు ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ గతంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నప్పుడు గ్రామాలకు చాలా అభివృద్ధి పథకాలు అందించారు వీటిల్లో ముఖ్యంగా రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా రైతుబంధు రైతు బీమా మరియు ఎరువులు అందించడం, రైతులు పండించిన వడ్లు కొనుక్కోవడం వంటివి చేశారు అలాగే గ్రామాల్లో పచ్చదనాన్ని పెంచుతూ ఇతర అభివృద్ధి కార్యక్రమాలు ఎన్నో చేశారు రోడ్లు నీళ్లు ప్రజలకు సమస్యలను పరిష్కరించారు అలాగే ముందుచూపుతో ఇప్పుడు జరుగుతున్న సర్పంచ్ ఎలక్షన్లో మన పార్టీ అభ్యర్థి అయినటువంటి వాళ్లను గెలిపించాలని వాళ్ల వల్ల గ్రామాల అభివృద్ధి జరుగుతుంది అని వచ్చే ఎన్నికల్లో కెసిఆర్ గారి ముఖ్యమంత్రి అవుతారని ఏలాంటి అభివృద్ధి అయినా కేసీఆర్ తోనే సాధ్యమని అన్నారు ఓటు వేసే ముందు ఒక్కసారి ఆలోచించండి సరైన అభ్యర్థిని ఎన్నుకోండి మన గ్రామ అభివృద్ధి మనకు ముఖ్యం అని వ్యాఖ్యానించారు
