Farmers Warned Not to Trust Brokers
దళారులను నమ్మి మోసపోవద్దు.
నాణ్యత ప్రమాణాలు పాటించాలి.
డిపిఎం యాదయ్య.
నిజాంపేట: నేటి ధాత్రి
రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యాన్ని విక్రయించాలని డిపిఎం యాదయ్య అన్నారు. నిజాంపేట మండలం నందగోకుల్ గ్రామంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రైతులు నాణ్యత ప్రమాణాలను పాటిస్తూ కొనుగోలు కేంద్రాల వద్దకు ధాన్యాన్ని తీసుకురావాలన్నారు. 48 గంటలలో రైతుల ఖాతాలో డబ్బులు జమవుతాయని పేర్కొన్నారు. అకాల వర్షాలు ఎప్పుడు సంభవిస్తాయో తెలియదు కాబట్టి రైతులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. కార్యక్రమంలో ఏపీఏం అశోక్, సీసీ వెంకటరాజం, రవీందర్, నిర్వాహకులు బురాని మంగమ్మ, వాణి, రజిత రైతులు ఉడేపు మహేష్, అందే స్వామి, పిట్ల రమేష్ తదితరులు ఉన్నారు.
