అధైర్య పడకండి అండగా ఉంటాం.

అధైర్య పడకండి అండగా ఉంటాం.

#మార్కెట్ కమిటీ చైర్మన్ పాల్వాయి శ్రీనివాస్.

నల్లబెల్లి, నేటి ధాత్రి:

 

ఇటీవల మండలంలోని మూడు చెక్కలపల్లి గ్రామంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల మొక్కజొన్న దగ్ధం కాగా విషయం తెలుసుకున్న నర్సంపేట మార్కెట్ కమిటీ చైర్మన్ పాల్వాయి శ్రీనివాస్ సంఘటన స్థలానికి చేరుకొని క్షేత్రస్థాయిలో పంటను పరిశీలించి నష్టపరిహారాన్ని అంచనా వేసి ప్రభుత్వానికి నివేదిక అందజేయాలని అధికారులు ఆదేశించారు. ఈ మేరకు పంట నష్టపోయిన రైతులను ఓదార్చి ధైర్యంగా ఉండండి ప్రభుత్వం అండగా ఉంటుందని రైతులకు భరోసా కల్పించారు. రాత్రనకా పగలనకా కాయ కష్టం చేసి పంట పండిస్తే ఇలాంటి దుర్ఘటన జరగడం చాలా బాధాకరమని నష్టాన్ని పూడ్చే విధంగా ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి దృష్టికి తీసుకువెళ్లి నష్టపరిహారం ఇప్పించే విధంగా కృషి చేస్తానని రైతులకు ఆయన హామీ ఇచ్చారు. ఆయన వెంట ఏడిఏ దామోదర్ రెడ్డి, తహసిల్దార్ ముప్పు కృష్ణ, మండల వ్యవసాయ అధికారి బన్న రజిత, కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి చిట్యాల తిరుపతిరెడ్డి, నర్సంపేట మండల అధ్యక్షుడు కత్తి కిరణ్, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ వైనాల అశోక్, నాయకులు జిల్లా మునిందర్, జెట్టి రామ్మూర్తి, బౌసింగ్, చిట్యాల ఉపేందర్ రెడ్డి, సుధాకర్, వేముల సంపత్ రెడ్డి, వెంగళ దాస్ రమేష్, జంగిలి మోహన్, పోగుల కుమారస్వామి, వైనాల పవన్, రఫీద్ నాయక్, సర్పంచ్ భూక్య భాస్కర్, రమణ, గ్రామ పార్టీ అధ్యక్షుడు రమేష్ నాయక్, వెంకన్న పార్టీ కార్యకర్తలు రైతులు తదితరులు ఉన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version