ఇల్లు లేని లబ్ధిదారులకు ఇల్లు ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీదీ
భూపాలపల్లి నేటిధాత్రి
భూపాలపల్లి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మహిళా కాంగ్రెస్ పట్టణ అధ్యక్షురాలు కడారి మాలతి ఆధ్వర్యంలో విలేకరుల సమావేశంలో నిర్వహించడం జరిగింది అనంతరం వారు మాట్లాడుతూ భూపాలపల్లి అంబేద్కర్ సెంటర్లో బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు గండ్ర జ్యోతి అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను కచ్చితంగా నెరవేరుస్తుందని భూపాలపల్లి శాసనసభ సభ్యులు ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ఆధ్వర్యంలో డబల్ బెడ్ రూమ్ ఇండ్ల పంపిణీ పారదర్శకంగా జరుగుతుందని ఇల్లు లేని పేదవాడికి లబ్ధి చేకూరుతుందని లబ్ధిదారులు ఆందోళన చెందవద్దని ఎవరి ప్రలోభాలకు లొంగవద్దని చెప్పడం జరిగింది ఈ కార్యక్రమంలో అర్బన్ పట్టణ అధ్యక్షురాలు కడారి మాలతి జిల్లా ప్రధాన కార్యదర్శి వావిళ్ళ కోమల అర్బన్ ప్రధాన కార్యదర్శి జంబోజు పద్మ బట్టు శ్రీలత ఎద్దు పుష్ప నాలిక పరమేశ్వరి పద్మ శారద మంగ సారక్క మహిళా కౌన్సిలర్లు రేణుక రజిత తదితరులు పాల్గొన్నారు