భూపాలపల్లి నేటిధాత్రి
సి ఎస్ ఆర్ ఫండ్స్ ఉండగా కార్మికుల జీతాలు నుంచి విరాళాలు ఇవ్వకూడదని అన్ని ఏరియాలో వారీగా సంతకాల సేకరణ జరిగినప్పటికీని వీళ్ళ సొంత ఇంట్లో నుంచి ఇచ్చినట్టుగా ఇద్దరు పెద్దమనుషులు ఇవ్వడం ఆశ్చర్యకరమని తెలంగాణ గోదావరి లోయ బొగ్గుగని కార్మిక సంఘం (ఇఫ్ట్) రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ చంద్రగిరి శంకర్ ఆరోపించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..
వర్షాకాలంలో కార్మికుడు డ్యూటీకి నానుకుంటూ వస్తాడు కానీ ఒక రైన్ కోట్ ఇవ్వడానికి ముందుకు రాని కంపెనీ,చలికాలంలో వణుక్కుంటూ కార్మికుడు డ్యూటీకి వస్తాడు ….కానీ ఒక స్వెటర్ ఇవ్వడానికి ముందుకు రాదు కంపెనీ,
నాణ్యమైన షూస్ ఉండవు,
సాక్సులు, హ్యాండ్ క్లౌజులు ఉండవు, కానీ జీతాల నుంచి కట్ చేసుకుంటే ఇవ్వడానికి మాత్రం పెద్ద మనుషులు ముందుకు వచ్చారనీ ,దానికి సహకరించారనీ అన్నారు.
కార్మికుల సంతకాల సేకరణను మాటను పక్కన పెట్టారనీ ,అంటే రిటైర్మెంట్ అయినా వాళ్లు ట్రేడ్ యూనియన్ లో ఉంటే ఏదైనా చేయొచ్చు అనేది నిరూపించారనీ,నిజంగా కష్టపడి రక్తం ఒడిచి పనిచేసే కార్మికుడు మాటని పక్కన పెట్టారనీ,ఆన్ డ్యూటీలో ఉన్న
ఉద్యోగస్తులు మాత్రమే ట్రేడ్ యూనియన్ లో నేతలుగా ఉంటే నిజంగా తమ సమస్యల పట్ల వారికి అవగాహన ఉంటుందనీ ,అందరి అభిప్రాయం మేరకు వాళ్లు నిర్ణయం తీసుకుంటారనీ, ఇలాగా వాళ్ల సొంత నిర్ణయాలు తీసుకొని కార్మికులను ముంచరు అని అన్నారు.ఈ కార్యక్రమం లో సి హెచ్ నర్సింగo, రాజశెట్టి సమ్మయ్య,చంద్రగిరి శంకర్ తదితరులు పాల్గొన్నారు.