
Pochamma Temple Construction.
పోచమ్మ తల్లి దేవాలయానికి విరాళం.
కల్వకుర్తి/ నేటి ధాత్రి :
కల్వకుర్తి పట్టణంలోని హనుమాన్ నగర్ కాలనీలో పోచమ్మ దేవాలయం నిర్మాణానికి విశ్రాంతి ఉపాధ్యాయుడు నాగులపల్లి యాదగిరి రూ 46,116 విరాళాన్ని శనివారం దేవాలయం నిర్వాహలకు అందజేశారు. ఈ విరాళంతో దేవాలయం గోపురం పైన ఉన్న కలశం చేయించినట్లు నిర్వాహకులు తెలిపారు. పెండింగ్లో ఉన్న పనులను పూర్తి చేయడానికి దాతలు విరాళాలు అందజేయాలని నిర్వాహకులు కోరారు.