"Silver Ornaments Donated to Pochamma Temple in Warangal"
పోచమ్మతల్లికి వెండి తొడుగులు విరాళం.
వరంగల్, నేటిధాత్రి.
మాజీ మంత్రి, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య-లక్ష్మి దంపతులు, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ 25వ డివిజన్ కార్పొరేటర్ బస్వరాజు శిరీష-శ్రీమాన్ దంపతులు, తమ అమ్మమ్మ వాళ్ళ గ్రామం అయిన హంటర్ రోడ్డు శాయంపేటలో, బస్వరాజు సారయ్య కుటుంబం తరపున హంటర్ రోడ్డు, శాయంపేటలో స్వయంభువుగా వెలసిన శ్రీ పోచమ్మ తల్లి అమ్మవారి విగ్రహానికి 5 కిలోల 250 గ్రాముల వెండితో తయారు చేసిన తొడుగులను బహుకరించారు. ఈ తొడుగులను రేపు, అంటే ఆగస్టు 21వ తేదీ ఉదయం 7 గంటలకు గ్రామస్థుల సమక్షంలో అమ్మవారికి ప్రత్యేకంగా పూజలు చేసి అలంకరించనున్నారు. ఈ సందర్భంగా బస్వరాజు సారయ్య మాట్లాడుతూ, అమ్మవారి ఆశీస్సులతో అందరు ఆయురారోగ్య సౌభాగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. పోచమ్మ తల్లి వేడుకలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారి కటాక్షం పొందాలని కుటుంబ సభ్యులు భక్తులందరికీ విజ్ఞప్తి చేశారు.
