వరంగల్ /గీసుకొండ,నేటిధాత్రి:
గీసుకొండ మండల కేంద్రంలోని చారిత్రక, మహిమాన్వితమైన సుప్రసిద్ద పుణ్యక్షేత్రం శ్రీలక్ష్మీనరసింహస్వామి గుట్ట వద్ద, దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో ఆర్చి నిర్మాణం చేపట్టారు.ఈ నేపథ్యంలో స్వామివారిని తమ ఇలవేల్పుగా కొలిచే శ్రీమాన్ నల్లబెల్లి వంశస్థుల కుటుంబ సభ్యులు ఆర్చి నిర్మాణానికి ఖర్చు భరించడానికి ముందుకొచ్చారు. ఈసందర్భంగా బుదవారం గుట్టను సందర్శించి, దేవాలయం చైర్మన్ ఏనుగుల సాంబరెడ్డికి రూ.68,701ల నగదు విరాళాన్ని అందజేశారు. ఈకార్యక్రమంలో నల్లబెల్లి నరసింహస్వామి బ్రదర్స్, నల్లబెల్లి నందగోపాల్ బ్రదర్స్, కీ. శే|| నల్లబెల్లి నరసింహస్వామి బ్రదర్స్, నల్లబెల్లి నందగోపాల్ బ్రదర్స్ బంధువులు, స్నేహితులు పాల్గొన్నారు.