రామడుగు, నేటిధాత్రి:
కరీంనగర్ జిల్లా రామడుగు మండలం వెలిచాల గ్రామంలో ఎవరైనా చనిపోతే, శవాన్ని పెట్టుకోడానికి బాడీ ఫ్రీజర్ అందుబాటులో లేక కరీంనగర్ జిల్లా కేంద్రంనుండి కిరాయి తెచ్చుకోవడాన్ని గమనించిన గ్రామ సర్పంచ్ వీర్ల సరోజన ప్రభాకర్ రావు, రామడుగు సింగిల్ విండో చైర్మన్ వీర్ల వెంకటేశ్వర రావు గ్రామంలోని ప్రజలు ఇబ్బంది పడకుండా, ఎవరైనా చనిపోతే వారి భౌతిక కాయాన్ని బాక్స్ లో పెట్టుకోవడనికి బాడీప్రీజరును తమ సొంత ఖర్చుతో గ్రామ ప్రజలకు సమకూర్చడం జరిగింది. గ్రామ పంచాయతీ కార్యాలయంలో బాడీప్రీజర్ అందుబాటులో కలదని కావాల్సిన వారు 7989379210 ఈఫోన్ నంబర్ కు సంప్రదించాలని సర్పంచ్ వీర్ల సరోజన ప్రభాకర్ రావు తెలిపారు.