బాల్క సుమన్ జన్మదినం సందర్భంగా రక్తదాన శిబిరం
మందమర్రి, నేటిధాత్రి:-
ఆపదలో ఉన్న ప్రతి వ్యక్తికి రక్తదానం చేసి ప్రాణదాతలు కావాలని, రక్తదానం ప్రాణదానం తో సమానమని బిఆర్ఎస్ యువ నాయకులు బెజ్జాల సది, చిత్తూరి కిరణ్ కుమార్ లు అన్నారు. బుధవారం మందమర్రి పట్టణంలోని షిర్కే 4వ వార్డ్ లో చెన్నూరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్, మంచిర్యాల జిల్లా అధ్యక్షులు బాల్క సుమన్ జన్మదినం సందర్భంగా 30 మంది యువ నాయకుల ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, అత్యవసర స్థితిలో ఉండి రోడ్డు ప్రమాద ఘటనల్లో గాయపడి ప్రకాలంలో రక్తం అందక చనిపోయిన వారు చాలా మంది ఉన్నారని అటువంటి వారికి రక్త దానం చేయడం ప్రాణదానంతో సమానమని అన్నారు. ఈ కార్యక్రమంలో బెజ్జాల సది, బత్తుల శ్రీనివాస్, చిత్తారి కిరణ్ కుమార్, రవి, చెన్న సంతు, నర్సిరెడ్డి, సోను, శివ, సురేష్, 30 మంది యువకులు పాల్గొన్నారు.