జడ్చర్ల నియోజకవర్గం బీఆర్ఎస్ కార్యకర్తలు,లక్ష్మన్న అభిమానులకు విజ్ఞప్తి!!
మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి
మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గం లో ప్రతి ఏటా ఫిబ్రవరి 3న జడ్చర్ల నియోజకవర్గ మాజీ మంత్రి,ప్రియతమ నేత లక్ష్మారెడ్డి జన్మదినం సందర్భంగా నిర్వహిస్తూ వస్తున్న రక్తదాన శిబిరాన్ని ఈ ఏడాది కూడా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయని
శనివారం ఫిబ్రవరి 3వ తారీఖున ఉదయం 9 గంటల నుండి జడ్చర్ల పట్టణంలోని చంద్ర గార్డెన్స్ లో నిర్వహిస్తున్న రక్తదాన కార్యక్రమానికి జడ్చర్ల నియోజకవర్గం లోని అన్ని మండలాలలో నుంచి అశేషంగా ప్రజలు తరలి వచ్చి రక్తదానం చేసి ఎంతో మంది ప్రాణాలను కాపాడిన వారమౌదమని
బీఆర్ఎస్ పార్టీ
జడ్చర్ల నియోజకవర్గం ఇన్చార్జి ఓ ప్రకటనలో తెలియజేశారు.