Lakshmi Blessings Through Deepadanam in Karthika Masam
కార్తీక మాసంలో దీప దానంతో లక్ష్మీదేవి అనుగ్రహం
మంచిర్యాల,నేటి ధాత్రి:
కార్తీక మాసంలో మహిళలు వేకువనే లేచి స్నానం ఆచరిస్తారు.ఈ మాసంలో పవిత్ర నదిలో లేదా పవిత్ర జలంతో బ్రహ్మముహూర్తంలో స్నానం ఆచరించాలి.తర్వాత దీపారాధన చేయాలి.దీప దానానికి ఈ పవిత్ర మాసంలో ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఆలయంలో లేదా ఇంట్లో తులసి మొక్క దగ్గర ప్రతిరోజూ దీపదానం చేయాలి.ఇలా చేస్తే జీవితంలో,ఇంట్లో చీకటి తొలగిపోతుందని,లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి సిరిసంపదలు లభిస్తాయని ఆధ్యాత్మికవేత్తలు చెబుతున్నారు.
