# రైతు కార్మిక వ్యతిరేకి మోడీ ప్రభుత్వాన్ని గద్దె దించాలి.
# సంయుక్త కిసాన్ మోర్చా రాష్ట్ర కన్వీనర్ పెద్దారపు రమేష్.
# ఎస్కెఎం ఆధ్వర్యంలో రైతు కార్మిక సంఘాల భారీ నిరసన ప్రదర్శన
వరంగల్ జిల్లా ప్రతినిధి/నర్సంపేట,నేటిధాత్రి :
మోడీ ప్రభుత్వ వినాశనకర విధానాలతో దేశ వ్యవసాయం దివాలా తీసి రైతాంగం సంక్షోభంలోకి నెట్టివేయబడుతున్నారని సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్ కే యం) రాష్ట్ర కన్వీనర్ పెద్దారపు రమేష్ అన్నారు. మోడీ బిజెపి పాలనకు చరమగీతం పాడితే తప్ప రైతు కార్మిక కష్టజీవుల హక్కులు రక్షించబడమన్నారు. సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేయం) ఆధ్వర్యంలో రైతు కార్మిక సంఘాలు మోడీ ప్రభుత్వాన్ని వ్యతిరేకంగా వరంగల్ రైల్వే స్టేషన్ నుంచి భారీ నిరసన ప్రదర్శన చేశారు. ఈ సందర్భంగా ఎస్కేయం జిల్లా కన్వీనర్ కుటుంబ బాబురావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఎస్కేఎం రాష్ట్ర కన్వీనర్ పెద్దారపు రమేష్, రాష్ట్ర నాయకులు గోనె కుమారస్వామి, వీరగోని శంకరయ్య, చంద్రన్న, రాచర్ల బాలరాజు, ఓదెల రాజన్న మాట్లాడుతూ కేంద్ర బిజెపి మోడీ ప్రభుత్వం రైతు వ్యతిరేక నల్ల చట్టాలను రద్దు చేస్తామని మద్దతు ధర రుణ విముక్తి చట్టాలను తీసుకొస్తామని హామీ ఇచ్చి తుంగలో తొక్కారని కార్పొరేట్ శక్తులకు లక్షల కోట్ల రూపాయల రుణాలను మాఫీ చేసి రాయితీలు ఇచ్చి పెంచి పోషిస్తూ రైతులు పండించిన పంటలకు సరైన మార్కెట్ సౌకర్యం కల్పించకుండా దళారులు వ్యాపారులు దోచుకునే విధంగా చట్టాలను మార్చడం సిగ్గుచేటు అన్నారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రైతాంగం ఐక్యంగా దేశాన్ని కాపాడండి రైతాంగని రక్షించండి రైతు వ్యతిరేక చట్టాలను రద్దుచేయండని దిక్కులు పిక్కటిల్లేలా సుదీర్ఘకాలంగా పోరాడుతున్న పట్టించుకోని మోడీ ప్రభుత్వం ఒకే దేశం ఒకే మార్కెట్ అంటూ ఆదాని అంబానీలకు దేశ సంపదను కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నదని ఆందోళన వ్యక్తం చేశారు.గత ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను విస్మరించి కొత్త హామీలతో మళ్ళీ ఎన్నికల్లో గెలవడానికి ప్రయత్నిస్తూ మతం పేరుతో మతసామరస్యాన్ని భారత లౌకికత్వాన్ని దెబ్బతీస్తున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. ఢిల్లీ సరిహద్దుల్లో రైతాంగం చేస్తున్న ప్రజాస్వామ్య ఉద్యమంపై నిర్బంధం ప్రయోగించి రైతుల ప్రాణాలను బలికొంటూ హక్కులకు భంగం కలిగిస్తుంది అన్నారు.ఈ పరిస్థితుల్లో రైతాంగాన్ని దేశాన్ని కాపాడుకోవాలంటే మోడీ ప్రభుత్వం గద్దె దిగాలని ఆ దిశలో ప్రజలు ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. మోడీ ప్రభుత్వం ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని తక్షణమే రైతుల పంటలకు కనీసం మద్దతు ధర చట్టం రైతు ఉద్యమానికి ఇచ్చిన హామీల అమలు చేపట్టాలని లేకపోతే తగిన గుణపాఠం తప్పదని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో రైతు కార్మిక సంఘాల జిల్లా నాయకులు చిర్ర సూరి, సుధమల్ల భాస్కర్, నర్ర ప్రతాప్, గన్నారపు రమేష్, గంగుల దయాకర్, పుల్ల రమేష్, చుక్క మొగిలి, మంద రవి, మహమ్మద్ బషీర్, కందికొండ కుమారస్వామి, ఎల్లబోయిన రాజు, పసునూటి రాజు, అంశాలు రెడ్డి, సంపత, మోహన్ రావు, సాయిలు, పాషా, అశోక్, పరిమళ ,గోవర్ధన్, రాజు లతోపాటు తదితరులు పాల్గొన్నారు.