Can Mental Stress Cause Muscle Pain?
మానసిక ఒత్తిడి.. కండరాల నొప్పికి కారణమవుతుందా?
కండరాల నొప్పికి అనేక కారణాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అయితే, మానసిక ఒత్తిడి కూడా కండరాల నొప్పికి కారణమవుతుందా? ఈ విషయంపై నిపుణులు ఏమంటున్నారో ఇప్పుడు తెలుసుకుందాం..
ఇంటర్నెట్ డెస్క్: ఇటీవలి రోజుల్లో కండరాల నొప్పి సమస్యలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. చాలామంది దీన్ని చిన్న సమస్యగా భావించి నిర్లక్ష్యం చేస్తుంటారు. ఎముకలకు లేదా ఇతర లోపాలకు సంబంధం లేకపోయినా.. కండరాల నొప్పి ఉంటే దానికి కొన్ని ముఖ్యమైన కారణాలు ఉండవచ్చు.
ఆరోగ్య నిపుణుల ప్రకారం, కండరాల నొప్పికి ప్రధాన కారణాల్లో ఒకటి ఎక్కువసేపు ఒకే స్థితిలో కూర్చోవడం. ముఖ్యంగా ల్యాప్టాప్ లేదా మొబైల్ ఫోన్ ముందు గంటల తరబడి కూర్చోవడం. సరైన భంగిమలో కూర్చోకపోవడం వల్ల మెడ, భుజాలు, వెన్నుపూస చుట్టూ ఉన్న కండరాలు బిగుసుకుని నొప్పి కలుగుతుంది. విటమిన్ D, కాల్షియం స్థాయిలు సాధారణంగా ఉన్నప్పటికీ, ఈ సమస్య మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు.
