
Doddi Komuraiah,
తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమురయ్య
దొడ్డి కొమురయ్య గారి ఆశయాల సాధన కోసం నేటి ప్రజానీకం నడుం బిగించాలి
సిరిసిల్ల టౌన్ :(నేటిధాత్రి)
సిరిసిల్ల పట్టణ కేంద్రంలోని బి.వై నగర్ లో ఈరోజు దొడ్డి కొమరయ్య గారి 79 వ. వర్ధంతి సందర్భంగా సిపిఎం ఆధ్వర్యంలో ఘన నివాళులు అర్పించడం జరిగినది.తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట తొలి అమరుడు , పోరాట స్ఫూర్తి ప్రదాత కామ్రేడ్.. దొడ్డి కొమరయ్య 79 వ. వర్ధంతి సందర్భంగా ఈ రోజు బి.వై. నగర్ లో సిపిఎం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు , విప్లవ జోహార్లు అర్పించడం జరిగినది.ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఎగమంటి ఎల్లారెడ్డి మాట్లాడుతూ భూమికోసం , భుక్తి కోసం , వెట్టి చాకిరి విముక్తి కోసం జరిగిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో తొలి అమరుడైన కామ్రేడ్.. దొడ్డి కొమురయ్య పోరాట స్ఫూర్తితో నేడు ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక , రైతు , ప్రజా వ్యతిరేక విధానాలపై నేటి ప్రజానీకం పోరాటాలకు సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కోడం రమణ , జిల్లా కమిటీ సభ్యులు అన్నల్దాస్ గణేష్ , సూరం పద్మ , శ్రీరాముల రమేష్ చంద్ర నాయకులు నక్క దేవదాస్ , బెజుగం సురేష్ , జిందం కమలాకర్ , గడ్డం రాజశేఖర్ , సందుపట్ల పోచమల్లు తదితరులు పాల్గొన్నారు.