తెలంగాణ భవన్ లో దొడ్డి కొమురయ్య జయంతి వేడుకలు
సిరిసిల్ల టౌన్: (నేటి ధాత్రి)
సిరిసిల్ల పట్టణంలోని ఈరోజు తెలంగాణ భవన్ లో తెలంగాణ సాయుధ పోరాట యోధుడు దొడ్డి కొమురయ్య జయంతి సందర్భంగా ఘనంగా నిర్వహించడం జరిగింది, సిరిసిల్ల బిఆర్ఎస్ పట్టణ మాజీ చైర్ పర్సన్ అధ్యక్షులు జిందం కళా చక్రపాణి పూలమాలవేసి మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమ పోరాట యోధుడు దొడ్డి కొమురయ్య అని, హైదరాబాద్ సంస్థానాధీశుడు ఏడవ నిజాం నవాబు ఉస్మాన్ ఆలీ ఖాన్ అండ కలిగిన స్థానిక భూస్వాములు, దొరల అరాచకాల నుంచి విముక్తి కోసం సంస్థాన ప్రజలు మధ్య వీరోచిత పోరాటం చేశారు అని తెలిపారు. అంతేకాకుండా కార్యక్రమంలో బి.ఆర్.ఎస్ తంగళ్ళపల్లి మండల అధ్యక్షుడు గజబింకర్ రాజన్న, సిరిసిల్ల మాజీ కౌన్సిలర్ దార్ల సందీప్ కీర్తన, కుంభాల మల్లారెడ్డి, తదితర టిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.