రామడుగు, నేటిధాత్రి:
డాక్టర్స్ డే, పోస్టల్ డే సందర్బంగా కరీంనగర్ జిల్లా రామడుగు మండలం గోపాలరావుపేట గ్రామంలోని ప్రాధమిక ఆరోగ్య కేంద్ర వైద్యురాలు మాధురి, పోస్టుమాన్ పంజాల శేఖర్ లను లయన్స్ క్లబ్ గోపాలరావుపేట ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించడం జరిగింది. ఈకార్యక్రమంలో లయన్స్ క్లబ్ సెక్రటరీ రాపెల్లి శ్రీనివాస్, కోశాధికారి పాకాల మోహన్, మాజీ జోన్ చైర్మన్ లు కర్ర శ్యాంసుందర్ రెడ్డి, కొడిమ్యాల వెంకటరమణ, మాజీ అధ్యక్షులు చాడ దామోదర్ రెడ్డి, కోట్ల మల్లేశం, ముదుగంటి రాజిరెడ్డి, అంజయ్య, తదితరులు పాల్గొన్నారు.