రామకృష్ణాపూర్, నేటిధాత్రి:
రామకృష్ణాపూర్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో డాక్టర్స్ డే,పోస్టల్ డే లను ఘనంగా నిర్వహించారు.పట్టణంలోని సింగరేణి ఏరియా హాస్పిటల్ వైద్యులను డివైసిఎంఓ ఉష ఆధ్యర్యంలో లయన్స్ క్లబ్ సభ్యులు శాలువాలతో సత్కరించి డాక్టర్స్ డే శుభాకాంక్షలు తెలిపారు.పోస్టల్ డే సందర్భంగా స్థానిక పోస్ట్ ఆఫిస్ లోని సిబ్బందిని శాలువాలతో సన్మానించి వారికి పోస్టల్ డే శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో రామకృష్ణాపూర్ లయన్స్ క్లబ్ అధ్యక్షులు గాజుల రాజేష్ కన్న,కార్యదర్శి పాకల శ్రీనివాస్ రెడ్డి,కోశాధికారి ఆడెపు లక్ష్మణ్,జెడ్ సి మంద వేణుగోపాల్, వేముల వెంకటేశం, ఎముల దేవేందర్ రెడ్డి,మార్కెటింగ్ చైర్మన్ పరికిపండ్ల రాజు,గోక శ్రీనివాస్,శఠగోపం విశ్వనాథ్ పాల్గొన్నారు.