పీ యూ అధ్యాపకుడు జ్ఞానేశ్వర్ కు డాక్టరేట్

వీపనగండ్ల మండలంలో వికసించిన విద్యా కుసుమం

• జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు తట్టుకొని నిలబడిన వైనం, ఎంతోమంది నిరుపేద విద్యార్థులకు ఆదర్శం

మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి

పాలమూరు యూనివర్సిటీలో రసాయన శాస్త్ర విభాగంలో అధ్యాపకునిగా పనిచేస్తున్న జ్ఞానేశ్వర్ ఉస్మానియా యూనివర్సిటీలో ప్రొఫెసర్ పార్థసారథి పర్యవేక్షణలో *సింతసిస్ ఆఫ్ న్యూ ఆర్గానిక్ ఛార్జ్ ట్రాన్స్ఫర్ కంప్లెక్స్ (నూతన కర్బన ఛార్జ్ ట్రాన్స్ఫర్ కాంప్లెక్స్ ల సంశ్లేషణ) అనే అంశం పై పీహెచ్డీ పూర్తి చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో వీసీ ఆచార్య శ్రీనివాస్ మాట్లాడుతూ నూతనంగా తయారు చేసిన కర్బన ఛార్జ్ సమ్మేళనాలు వైద్య రంగంలో ముఖ్య భూమిక వహిస్తాయని, జీవ కణంలోని జన్యు పదార్థాల అనుసంధానం కోసం ఉపయోగపడతాయని, ఈ సమ్మేళనాలకు కాన్సర్ నిరోధక శక్తి ఉంటుందని, మెటీరియల్ సైన్స్ లో అద్భుత వాహకాలుగా పని చేస్తాయని,యూనివర్సిటీలో పరిశోధనలకు పెద్ద పీటలు వేస్తున్నామని,గ్రామీణ ప్రాంత విద్యార్థులను కూడా పరిశోధనల వైపు మళ్లించాలని అన్నారు. రిజిస్ట్రార్ చెన్నప్ప డాక్టర్ జ్ఞానేశ్వర్ ని అభినందిస్తూ నూతన ఆవిష్కరణలు మానవాళి మనుగడకు ఉపయోగపడతాయని అన్నారు.
కుటుంబ నేపథ్యం
రెక్కాడితే గాని డొక్కాడని నిరుపేద కుటుంబంలో జన్మించిన జ్ఞానేశ్వర్ తల్లిదండ్రులు మీసాల రాముడు మరియు గంగమ్మ.
ఈయన స్వస్థలము వీపనగండ్ల మండలము, వనపర్తి జిల్లా.

విద్యాభ్యాసం

జ్ఞానేశ్వర్ 1 నుంచి 4వ తరగతి వరకు వీపనగండ్ల ప్రాథమిక పాఠశాలలో చదివారు. ఉపాధ్యాయుల ప్రోత్సాహంతో గురుకుల పరీక్షలో అర్హత సాధించి ఐదవ తరగతి నుంచి 12వ తరగతి వరకు గురుకుల పాఠశాల, లింగాల లో చదివారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సిల్వర్ జూబ్లీ డిగ్రీ కాలేజ్ కర్నూల్ లో డిగ్రీ పూర్తి చేశారు. అనంతరం హోం ట్యూషన్స్ చెబుతూ పీజీ అర్హత పరీక్షకు ప్రిపేర్ అయి ఉస్మానియా యూనివర్సిటీ కెమిస్ట్రీ విభాగంలో పీజీ పూర్తి చేసి, ఏకంగా యూనివర్సిటీ టాపర్ గా నిలిచారు. పీజీ టాపర్ గా రావడం తో ఉస్మానియా యూనివర్సిటీ గోల్డ్ మెడల్ తో సత్కరించింది. ఉస్మానియా యూనివర్సిటీలో పిహెచ్డి పూర్తి చేశారు. అంతర్జాతీయ కాన్ఫరెన్స్ లో బెస్ట్ పోస్టర్ అవార్డు సాధించి, నగదు బహుమతి పొందారు. ఈయన చేసిన పరిశోధనా పత్రాలు పలు జాతీయ అంతర్జాతీయ జర్నల్స్ లో ప్రచురితమయ్యాయి.

అదనపు బాధ్యతలు
జాతీయ సేవ పథకం ప్రోగ్రాం అధికారిగా, పీజీ బాయ్స్ హాస్టల్ వార్డెన్ గా కొనసాగుతున్నారు. ఈ కార్యక్రమంలో ఓ ఎస్ డి డాక్టర్ మధుసూదన్ రెడ్డి , ప్రిన్సిపల్ డాక్టర్ చంద్ర కిరణ్ ,ఎన్ ఎస్ ఎస్ కోఆర్డినేటర్ డా ప్రవీణ ,అధ్యాపకులు డాక్టర్ అర్జున్ కుమార్ , డాక్టర్ రవి కుమార్ , డా పర్వతాలు, సుదర్శన్ రెడ్డి ,డాక్టర్ రాజశేఖర్ , రాంమోహన్ , డా సిద్దరామ గౌడ్ ,స్వాతి , మాధురి మోహన్గారు , కల్పన,ఉమ్మడి పాలమూరు జిల్లా లోని మిత్రులు, అధ్యాపకులు తదితరులు జ్ఞానేశ్వర్ ని అభినందించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!