Doctorate Honour for Social Service
సామాజిక సేవలో డాక్టరెట్ పొందటం అభినందనీయం : ప్రముఖ పారిశ్రామికవేత్త రాఘవేందర్ రావు
డాక్టరెట్ రెడ్డిశ్రీనివాసరావును సన్మానించిన కాప్రా కావు సంఘం నాయకులు
కాప్రా నేటిధాత్రి :
నిత్యం సామాజిక సేవ కార్యక్రమాలలో విశేషంగా కృషిచేస్తున్న రెడ్డిశ్రీనివాసరావుకు డాక్టరెట్ అందజేయడం అభినందనీయమని ప్రముఖ పారిశ్రామికవేత్త బొండాడ గ్రూప్ చైర్మాన్ బొండాడ రాఘవేందర్రావు అన్నారు. కాప్రా సర్కిల్ కు చెందిన రెడ్డిశ్రీనివాసరావు సామాజిక సేవ కార్యక్రమాలలో చేస్తున్న కృషిని గుర్తించి ఇటీవల మలేషియాకు చెందిన మాస్ట్రో గ్లోబల్ యూనివర్సిటీ వారు గౌరవ డాక్టరేట్ పట్టా అందజేసి గౌరవించారు. సోమవారం కాప్రా కావు కులాల ఐక్య వేదిక ప్రతినిదులు రెడ్డిశ్రీనివాసరావు దంపతులను ఘనంగా సన్మానించారు. ఈకార్యక్రమంలో రాఘవేందర్ రావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్ధి దశ నుంచే నాయకుడిగా విద్యార్ధి ఉద్యమాలలో కీలక పాత్ర పోషించి. లయన్స్ క్లబ్లో చేరి ఎన్నో ఉచిత వైద్య శిభిరాలతో పాటు నిరుపేదలకు కుట్టు మిషన్లు, విద్యార్థులకు పుస్తకాల పంపిణి, అల్ ఇండియా హ్యూమన్ రైట్స్ కమిషన్ లో చేరి 15 సంవత్సరాల పాటు జంట నగరాల అధ్యక్షుడుగా బడుగుల, పీడిత ప్రజల హక్కుల కోసం పోరాటం చేశారని అన్నారు. రెడ్డిశ్రీనివాసరావు చేస్తున్న సేవ కార్యక్రమాలు ఇతరులకు ఆదర్శంగా ఉన్నాయని తెలిపారు. ఈకార్యక్రమంలో కాప్రా కాపు కులాల ఐక్యవేదిక అధ్యక్షుడు జీవీఎన్ రావు ప్రధాన కార్యదర్శి నాగు, ప్రతినిదులు దేవరకొండ శ్రీనివాసరావు, కొత్తపల్లి రాంబాబు, పులినత్యనారాయణ, దాసరి ప్రసాద్, కోసూరి, రామోహ్మన్ రావు, రాబారావు, నానాజీ, శివ, ఉంగరాల నాయుడు, బాలక్రిష్ణ, జయరాం తదితరులు పాల్గొన్నారు.
