Winter Health Benefits of Radish
శీతాకాలంలో ముల్లంగి వల్ల కలిగే ప్రయోజనాలు తెలుసా?
శీతాకాలంలో ముల్లంగి తినడం ఆరోగ్యానికి మంచిదేనా? దాని వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..
శీతాకాలంలో ముల్లంగి అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ముల్లంగిలో అనేక వ్యాధులను నయం చేయగల పోషకాలు ఉన్నాయని అంటున్నారు. అయితే, శీతాకాలంలో ముల్లంగి తినడం ఆరోగ్యానికి అంత మంచిదా? దాని వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..
ముల్లంగిలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. వీటిలో విటమిన్ సి, ఫోలేట్, పొటాషియం, మెగ్నీషియం, విటమిన్ బి6 వంటి పోషకాలు ఉంటాయి. ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు, గ్లూకోసినోలేట్లకు మంచి మూలం కావడంతో, ముల్లంగి ఆరోగ్యానికి ఒక వరం. అయితే, రాత్రిపూట ముల్లంగి తినకుండా ఉండాలి. ముల్లంగి వేడి, చల్లని ప్రభావాన్ని కలిగి ఉంటుంది. చలి స్వభావం ఉన్నవారు రాత్రిపూట ముల్లంగి తినకుండా ఉండాలి.
