లావణ్య మెగా ఫ్యామిలీకి ఎంత కట్నం తీసుకొస్తుందో తెలుసా..?

లావణ్య త్రిపాఠి ఇండస్ట్రీకి వచ్చిన అతి తక్కువ టైంలోనే స్టార్ బ్యూటీగా పాపులారిటీ సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ మరికొద్ది రోజుల్లోనే మెగా ఫ్యామిలీకి కోడలు కాబోతుంది .

త్వరలో వరుణ్ తేజ్ ని పెళ్లి చేసుకోబోతుంది. వీళ్లిద్దరూ కలిసి సినిమాలు చూస్తున్న టైం లోనే లవ్ లో పడ్డారు. ఆ ప్రేమను గుట్టు చప్పుడు కాకుండా దాచిపెట్టి ఇన్నాళ్లకు ఓపెన్ అయ్యారు.
త్వరలోనే ఇటలీలో వీళ్ల పెళ్లి గ్రాండ్ గా జరగబోతుంది . ఇలాంటి క్రమంలోనే అసలు లావణ్య మెగా ఫ్యామిలీ ఇంటికి ఎంత కట్నం తీసుకొస్తుంది అనే వార్తలు ఇప్పుడు వైరల్ గా మారాయి.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్ ప్రకారం లావణ్య త్రిపాఠి మెగా ఫ్యామిలీకి ఒక్క రూపాయి అంటే ఒక్క రూపాయి కూడా కట్నం తీసుకురావడం లేదట . అసలు మెగా ఫ్యామిలీ కట్నం అవసరం లేదు అంటూ తేల్చి చెప్పిందట . వరుణ్ లావణ్యను ప్రేమించుకున్నారు వాళ్ళు హ్యాపీగా ఉండటమే మాకు చాలు . ఇక అంతకుమించిన కట్నం మాకు అవసరం లేదు అంటూ నాగబాబు – చిరంజీవి లావణ్య తల్లిదండ్రులకు క్లియర్ గా చెప్పారట.

కానీ లావణ్య పేరెంట్స్ తమకు ఉన్నంతలో ఆమెకు బాగానే ఇచ్చి పంపిస్తున్నట్టు తెలుస్తుంది . లావణ్య ఇండస్ట్రీలోకి వచ్చి సంపాదించిన డబ్బులు మొత్తం ఆమెకే ఇచ్చేస్తున్నారట . అంతేకాదు ఆమె కోసం తరతరాలుగా వస్తున్న ఆస్తిని సైతం సమాన వాటాగా వేసి లావణ్య పేరుపై రాసేసారట.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!