మాకు న్యాయం చేయండి.

కొడుకులపై వాల్ పోస్టర్లు వేసిన వృద్ధ దంపతులు .

చిట్యాల, నేటి ధాత్రి :

కొడుకులు మానసికంగా ఇబ్బందుల గురి చేస్తున్నారని మేము భరించలేక పోతున్నామంటూ పిల్లలు ఉన్నా అనాథలుగా బ్రతుకుతున్నామంటూ ఓ వృద్ధ దంపతుల ఆ గ్రామంలో వాల్ పోస్టర్ లు వేసి మాకు న్యాయం చేయాలంటూ అధికారులను వేడుకుంటున్న ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం రామచంద్రాపురం గ్రామంలో చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళితే…భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం రామచంద్రా పురం గ్రామానికి చెందిన క్యాతం భూమయ్య వరలక్ష్మి అనే వృద్ధ దంపతులకు ముగ్గురు కొడుకులు ఒక కూతురు ఉన్నారు. తను సంపాదించిన ఆస్తి వ్యవసాయ భూమిని గత కొన్ని ఏళ్ళ క్రితం పెద్ద కొడుకుకు 20 గుంటలు ఎక్కువగా మిగతా ఇద్దరు కొడుకులకు సమాన వాటా లుగా కూతురుకు ఒక ఎకరం భూమిని పంచి ఇవ్వడం జరిగింది. అయినప్పటికీ పెద్ద కొడుకు క్యాతం రమేష్ చిన్న కొడుకు క్యాతం సతీష్ లు ఇద్దరు మమ్మల్ని హింసిస్తూ వేధిస్తూ మానసిక క్షోభకు గురి చేస్తున్నారంటూ ఆ వృద్ధ దంపతులు ఆ గ్రామంలో ఫోటోలతో కూడిన వాల్ పోస్టర్ లు వేసి ఎక్కడికి పోయినా కూడా మాకు న్యాయం జరుగుత లేదంటూ మందు డబ్బా పట్టుకుని చావే మాకు దిక్కని ఇప్పటికైనా అధికారులు మాకు న్యాయం చేయాలంటూ వేడుకుంటున్నారు.ఈ సందర్భంగా వృద్ధ దంపతులు మాట్లాడుతూ…నా పెద్దకొడుకు క్యాతం రమేష్ చిన్న కొడుకు క్యాతం సతీష్ ఇద్దరు కలిసి మమ్మల్ని వేధిస్తూ మానసిక క్షోభకు గురి చేస్తున్నారని మేము బరించ లేక పోతున్నామని తెలిపారు. వృద్ధులైన మాకు గత కొన్ని సంవత్సరాలుగా పంటలు పండకపోవడం తో పాటు పాత ఇల్లు కూలి పోయే దశలో ఉండగా కొత్త ఇల్లు నిర్మించుకున్నామని దీంతో కొన్ని అప్పులు కాగా పంటలు పండక పోతాయా అన్న ఆశతో పంట పండిస్తున్న ప్పటికీ పంటలు దిగుబడి రాక పోవడం తో అప్పులు పెరిగి పోయాయి. ఈ క్రమంలో నేను నా కొడుకుల ను పెద్ద మనుషులు దగ్గరికి పలు మార్లు పిలిపించి నేను ఉంచుకున్న భూమి నా పట్టా భూమిలోని 20 గుంటలు అమ్మి అప్పు కడుదామంటే నా పెద్ద కొడుకు రమేష్ చిన్న కొడుకు సతీష్ లు నన్ను నానా భుతులు తిడుతూ భూమిని అమ్మ నీయకుండా అడ్డు పడుతున్నారు. అప్పులు ఇచ్చిన వారు ఇంటికి వచ్చి ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఈ క్రమంలో నేను ఎక్కడికి వెల్లి నా బాధను చెప్పుకున్నా కూడా నాకు న్యాయం జరుగుతాలేదు. వృద్దులమైన మాకు పోలీస్ స్టేషన్కు వెళ్లి మా భాధ చెప్పుకున్నా కూడా మాకు న్యాయం జరుగక పొగా నా ఇద్దరు కొడుకులు నా మీదనే ఉల్టా కేసులు పెట్టించి ఇబ్బందులకు గురిచేస్తున్నారంటూ మందు డబ్బా పట్టుకుని మాకు న్యాయం కావాలంటూ జిల్లా కలెక్టర్ జిల్లా ఎస్పీ స్పందిచాలంటూ తమ గోడును వెళ్ళ బోసుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *